అరుదైన రికార్డు సాధించిన తిలక్‌ వర్మ..

విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో కొత్త బ్యాటర్‌ తిలక్‌ వర్మ తాను ఆడిన రెండో మ్యాచ్‌ ద్వారా సరికొత్త రికార్డ్‌ నెలకొల్పాడు.

New Update
అరుదైన రికార్డు సాధించిన తిలక్‌ వర్మ..

Tilak Varma Achieved a Rare Record: విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌ ఖాతా తెరవలేదు. మొదటి టీ20 మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన భారత జట్టు.. ఆదివారం జరిగిన రెండో టీ20లో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో వెస్టిండీస్ టీమ్‌ 18.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టాపోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆ జట్టులో పూరన్ (67) పరుగులతో అదరగొట్టాడు.

మరోవైపు టీ20 సీరీస్‌ ద్వారా అంతర్జాతీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన తిలక్‌ వర్మ, రెండవ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఈ 50తో తిలక్‌ వర్మ అరుదైన రికార్డును సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అతి చిన్న వయస్సులో ఆఫ్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా తిలక్‌ చరిత్ర సృష్టించాడు. తిలక్‌ వర్మకు 20 సంవత్సరాల 271 రోజుల వయసు ఉన్నప్పుడు ఈ రికార్డ్ సాధించడం విశేషం. ఓవరాల్‌గా చిన్న వయస్సుల్లో ఆఫ్‌ సెంచరీలు సాధించిన క్రికెటర్లను పరిశీలిస్తే.. 20 సంవత్సరాల 271 రోజుల వయసులో తిలక్‌ వర్మ ఈ రికార్డ్‌ను నమోదు చేయగా.. భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ 2007వ సంవత్సరంలో 21 ఏళ్ల 38 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. రాబిన్‌ ఉతప్ప 21 ఏళ్ల 90 రోజులకు హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. సురేశ్ రైనా 22 ఏళ్ల 90 రోజులు ఆఫ్‌ సెంచరీ నమోదు చేసి వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.

మరోవైపు తన ఆఫ్‌ సెంచరీపై స్పందించిన తిలక్‌ వర్మ తన మొదటి 50ని కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. దీనికిగల కారణాన్ని కూడా బ్యాటర్‌ వెల్లడించాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ టీమ్‌తో ఆడుతున్న సమయంలో సమైరాతో అనుబంధం ఏర్పడిందని, అంతర్జాతీయ కెరీర్‌లో నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని సమైరాకి గుర్తుగా ఇస్తానని ప్రామిస్ చేసినట్లు తెలిపాడు. తాను సమైరాతో కలిసి హాఫ్‌ సెంచరీ సెలబ్రేషన్‌ను జరుపుకుంటానని వెల్లడించాడు. కాగా తిలక్‌ వర్మ బ్యాంటిగ్‌ శైలి ఇలాగే కొనసాగిస్తే ఇదే నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానందక్కే అవకాశం ఉంది. దీంతోపాటు వన్డే వరల్డ్‌ కప్‌, టీ20 ప్రపంచకప్‌లో సైతం అతనికి స్థానం కన్ఫామ్‌ అయినట్లే అని చెప్పుకోవచ్చు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు