/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/puli-jpg.webp)
East Godavari: గత పది రోజులుగా మెట్ట ప్రాంత ప్రజలను పులి సంచారం భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో పులి పాదమూత్రలు ప్రత్యక్షమయ్యాయి. ఈ రోజు ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలకు పెద్దపులి పాదముద్రలు కనిపించాయి.. అవి చూసి భయాందోళనకు గురైన రైతులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
Also Read: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్
హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకున్నారు అటవీ శాఖ అధికారులు. పులి పాదముద్రలను తనిఖీ చేసి గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి మండలంలో పెద్దపులి సంచారం పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
దీంతో, స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పెద్దపులి సంచారంతో పొలం పనులకు వెళ్లాలన్నాఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. గ్రామంలో స్వేఛ్చగా తిరిగేందుకు కూడా వీలులేదని..పిల్లలతో భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.