Tiger Nageswara Rao: వివాదాల సుడిగుండంలో 'టైగర్ నాగేశ్వరావు'.. సినిమాను నిలుపుదల చేస్తారా?

టైగర్ నాగేశ్వరావు సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాతకు కోర్టు నోటిసులు అందగా.. మరోవైపు స్టువర్ట్‌పురం గ్రామస్తులు నిరసనలు ఉధృతం చేస్తున్నారు. స్టువర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశం నేర రాజధానిగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

New Update
Tiger Nageswara Rao: వివాదాల సుడిగుండంలో 'టైగర్ నాగేశ్వరావు'.. సినిమాను నిలుపుదల చేస్తారా?

Tiger Nageswara Rao: హీరో రవితేజ(ravi teja) నటించిన 'టైగర్ నాగేశ్వరావు' సినిమాను వివాదాలు వీడడం లేదు. సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టువర్టుపురం గ్రామస్తులు. తమ జాతిని, తమ గ్రామాన్ని కించపరిచే విధంగా టైగర్ నాగేశ్వరావు సినిమాను నిర్మిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

ఎరుకల జాతి కమ్యూనిటీకి చెందిన టైగర్ నాగేశ్వరావును గజదొంగలాగా చూపించడంతోపాటు, స్టువర్టుపురం ఉన్న అందరూ దొంగలు అనే విధంగా సినిమా తీశారంటున్నారు గ్రామస్తులు. సినిమాను ఆపాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్టువర్టుపురం గ్రామస్తులు.

Also Read: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ‘మెగా’ రివ్యూ.. బొమ్మ అదుర్స్ అంటూ ట్వీట్..
ఉద్యమిస్తాం:
సినిమాని ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్టువర్ట్ పురం గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. స్టువర్టుపురం(stuart puram) గ్రామాన్ని దక్షిణ భారతదేశం నేర రాజధానిగా చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీరు తీస్తున్న సినిమాల కారణంగా తమ గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు గ్రామస్తులు. సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ తమని సంప్రదించలేదంటున్నారు. ఇక నిర్మాణ సంస్థ సామాజిక బాధ్యత లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేట్ పొందకుండా టీజర్ (teaser) విడుదల చేయడంపై ఇటివలే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌(Abhishek agarwal) కు న్యాయపరమైన నోటీసులు ఇచ్చింది.

కోర్టులో బంతి:
టైగర్ నాగేశ్వరరావు సినిమా 'ఎరుకుల' వర్గాల మనోభావాలను కించపరచడమే కాకుండా స్టువర్టుపురం గ్రామస్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ పిటిషనర్ చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై స్పందిస్తూ, ఈ కేసులో ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది. జస్టిస్ ధనార్జనే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. సినిమాల నిర్మాణం ఒక వర్గం లక్ష్యం కాకూడదని, సమాజం పట్ల బాధ్యతాయుత భావాన్ని కూడా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ దృక్కోణం ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంతో పాటు సామాజిక నిబంధనలను ప్రభావితం చేస్తుందన్నారు. కళ, మీడియా విస్తృత సామాజిక పాత్రను ప్రతిబింబిస్తాయన్నారు. వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ , అనుపమ్ ఖేర్, జాన్ అబ్రహం, జిషు సేన్‌గుప్తా, రేణు దేశాయ్, భాను ప్రకాష్, నూపూర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ లాంటి స్టార్-స్టడెడ్ తారాగణం ఉంది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ: మధి, ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్.

ALSO READ: ‘బలగం’ సినిమా నటుడు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డైరెక్టర్ వేణు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Prabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్‌ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే!

ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.

New Update
unni mukundan key role in prabhas spirit

unni mukundan key role in prabhas spirit

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వీటి తర్వాత ప్రభాస్ లైనప్‌లో స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలు ఉన్నాయి. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అయితే వీటిలో ముందుగా సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే ‘స్పిరిట్’ మూవీపైనే అందరి చూపులు ఉన్నాయి. యానిమల్ మూవీతో తన మార్క్ చూపించిన సందీప్‌ ఇప్పుడు ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి దర్శకుడు సందీప్ ఆసక్తిక విషయాలు వెల్లడించి హైప్ పెంచేశాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

పోలీస్ పాత్రలో

ఇందులో ప్రభాస్ లుక్ చూస్తే అందరి మతులు పోతాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని లుక్కులో డార్లింగ్‌ను చూపిస్తానని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పాడు. దీంతో అందరూ ఇప్పుడు ఈ సినిమా కోసమే చూస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో అంతా ఇప్పుడు ఈ చిత్రం కోసమే మాట్లాడుకుంటున్నారు. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

కీ రోల్‌లో స్టార్ హీరో

ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా మరొక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ‘మార్కో’ హీరో  ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో అతడు కీ రోల్‌ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్‌తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

spirit | Prabhas Spirit | prabhas | director-sandeep-reddy-vanga | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment