పత్తి కూలీలపై పులుల దాడి.. ఆ జిల్లాను వణికిస్తున్న కృర మృగాలు

కొమురం భీం జిల్లాలో పులుల సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నుంచి నాలుగు పులులు తిరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరుస దాడులు చేయగా ఇప్పపటికే పలువురు పత్తి కూలీలు పులుల దాడిలో మరణించారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

New Update
పత్తి కూలీలపై పులుల దాడి.. ఆ జిల్లాను వణికిస్తున్న కృర మృగాలు

Tiger Attack Cotton Workers : విజ్ఞానం వెర్రి, భయంకరమైన స్వార్థంతో మానవుడు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఈ క్రమంలో తన వినాశాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. ఫలితంగా అడవిలో బతకాల్సిన జంతువులు ఇటీవల కాలంలో జనవాసాల బాట పడుతున్నాయి. పచ్చని అడవిలో సేదతీరాల్సిన వన్యప్రాణులు పల్లెలు, పట్టణాల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అంతరించిపోతున్న అడవుల్లో ఆహారం దొరకకపోవడంతో గ్రామాల్లోకి తరలుతున్న పులులు, గుడ్డేలుగులు పెంపుడు జంతువులతోపాటు మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల ప్రజలు పులుల సంచారంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటే.. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా జనాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటచేలకు వెళ్లిన కూలిలపై దాడులకు పాల్పడుతూ భీభత్సం సృష్టిస్తున్నాయి.

ఈ మేరకు కొమురం భీం(Komaram Bheem) జిల్లాలో పెద్దపులి సంచారం సంచలన రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు ఏ రోజు ఎక్కడ పులి దాడి చేస్తుందో తెలియక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. ఏ దిక్కునుంచి వచ్చి తమను చంపి తింటుందో తెలియక జనం హడలెత్తిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పులులు తిరుగుతున్నట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇటీవలే అంకుశపురం ప్రాంతంలో పశువుల కాపరిపై పులి దాడి చేయగా చింతలమానపల్లి అటవీ ప్రాంతంలోనూ పశువులపై దాడి చేసిందని గోడు విన్నవించుకుంటున్నారు. అంతేకాదు ఈ మధ్యే ఆసిఫాబాద్ అటవీ ప్రాంతంలో పనికోసం పొలానికి వెళ్లిన ఓ వ్యక్తి ఆచూకీ ఇప్పటికీ లభించలేదని, మనిషి రక్తం రుచి మరిగిన క్రూర మృగం అదే పనిగా మనుషులు సంచరించే ప్రాంతాలే టార్గెట్ గా తిరుగుతన్నట్లు చెబుతున్నారు.

Also read : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆస్పత్రిలో అల్లాడిపోయిన రోగులు

అలాగే కొమురం భీం జిల్లాలో వాంకిడి, దహెదాం, దిగడ, చింతల మానేపల్లి ప్రాంతాల్లో పత్తి కూలీలపై పులుల దాడి చేశాయని, ఈ దాడి కారణంగా పలువురు అక్కడికక్కడే మృతి చెందగా కొంతమంది చికిత్స పొందుతూ మరణించినట్లు స్థానికులు వాపోతున్నారు. ఇక ఆదిలాబాద్ ప్రాంతంలోనే కాకుండా మహారాష్ట్ర తడోబా నుంచి కాగజ్‌నగర్ డివిజన్ లోనూ పులులు సంచరిస్తున్నాయని, మూడేళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో జనాలపై వరుసగా దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఇష్యూపై పలుసార్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన పెద్దగా పట్టించుకోవట్లేదని, ఎలాంటి చర్యలు తీసుకోవట్లదని తదితర గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు