Video Viral: బీచ్‌లో చెత్త వేయకండి..పాపం పాము చూడండి

ప్లాస్టిక్‌ను సముద్రంలో వేయడం వల్ల జీవరాసులు చనిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా ఒక కొండ చిలువ బీచ్‌ టవల్‌ను మింగిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Video Viral: బీచ్‌లో చెత్త వేయకండి..పాపం పాము చూడండి

Video Viral: ఏటా సముద్రంలో కొన్ని లక్షల టన్నుల వ్యర్థ పదార్థాలు కలుస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్లాస్టిక్‌ను సముద్రంలో వేయడం వల్ల జీవరాసులు చనిపోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. తాజాగా ఒక కొండ చిలువ బీచ్‌ టవల్‌ను మింగిన వీడియో వైరల్‌గా మారింది. పశువైద్యులు దాన్ని పట్టుకుని టవల్‌ను బయటికి తీస్తున్న వీడియో చూస్తుంటే అయ్యో పాపం అనకమానరు.

View this post on Instagram

A post shared by Invention (@invention)

ఇది పాత వీడియో అయినప్పటికీ ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఆస్ట్రేలియాలో జరిగింది. పాము అనుకోకుండా బీచ్ టవల్‌ను మింగేసింది. పామును గమనించిన మినాటీ చుట్టుపక్కల ప్రజలు వింతగా ప్రవర్తించడం చూసి దాన్ని సిడ్నీలోని స్మాల్ యానిమల్ స్పెషలిస్ట్ ఆస్పత్రికి పంపారు. అక్కడికి చేరుకున్న వైద్యబృందం కొండచిలువను తీసుకెళ్లి దానికి ఆపరేషన్‌ చేసి టవల్‌ను బయటికి తీశారు. 18 ఏళ్ల ఈ కొండచిలువ 5 కిలోల బరువు, 3 మీటర్ల పొడవు ఉంది.

publive-image

దానిలోపల టవల్‌ ఎంత పొడవు ఉందో తెలుసుకోవడానికి ఎక్స్-రేలను తీశారు. అంతేకాకుండా కడుపులో ఎండోస్కోప్‌ చేశారు. ఒక డాక్టర్‌ పామును పట్టుకుంటే మరో వైద్యుడు దాని నోట్లో నుంచి టవల్‌ను బయటికి లాగారు. కొన్ని గంటలు చికిత్స అందించిన తర్వాత కొండ చిలువను వదిలేశారు. వీడియో వైరల్‌గా మారడంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలా సముద్రంలో ప్లాస్టిక్‌ వస్తువులు, చెత్తను పడేయడం ఇకనైనా మానుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: పడుకున్న దాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే.. ఏం జరిగిందో చూడండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు