Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం!

బాలాసోర్‌ రైలు ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో వందేభారత్‌ తో పాటు మరో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చేశాయి.

New Update
Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం!

కొంత కాలం క్రితం ఒడిశాలోని బాలాసోర్‌ జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో మూడు రైళ్లు ఒకదానిని ఒకటి ఢీకొట్డడంతో వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ ప్రమాదం గురించి ఇంకా చాలా మంది మరచిపోనే లేదు.

ఎన్నో కుటుంబాల్లో చేదు జ్ఙాపకాలను మిగిల్చింది ఆ ప్రమాదం. తాజాగా అదే ఒడిశాలో మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. మూడు రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందర్‌గఢ్‌ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం నాడు వందేభారత్‌ తో పాటు మరో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌ పైకి వచ్చేశాయి.

ముందుగా సంబల్‌పూర్‌-రూర్కెలా మెము రైలు , రూర్కెలా- ఝార్పుగూడ పాసింజర్‌ రైలు ఒకే ట్రాక్‌ పై ఎదురెదురుగా వచ్చేశాయి. అయితే వెంటనే ఈ విషయాన్ని గమనించిన లోకోపైలట్లు అప్రమత్తం కావడంతో ఆ రెండూ 100 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో పూరి- రూర్కెలా మధ్య నడిచే సూపర్‌ ఫాస్ట్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా అదే ట్రాక్‌ పైకి దూసుకుని వచ్చింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వందేభారత్ లోకోపైలట్‌ ను అప్రమత్తం చేశారు. దీంతో అది 200 మీటర్ల దూరంలో ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగాఈ మూడు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చినట్లు అధికార వర్గాలు భావిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Also read: ఇంటర్ లో బయోలజీ చదవకున్నా డాక్టర్ కావొచ్చు.. స్టూడెంట్స్ కు మెడికల్ కమిషన్ గుడ్ న్యూస్!

Advertisment
Advertisment
తాజా కథనాలు