Happy Forever Tips: డబ్బు, హోదా అక్కర్లేదు.. ఇలా చేస్తే మీ లైఫంతా హ్యపీనే..! సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సంతోషమనే స్వర్గంలో విహరించే అద్భుతమైన గోల్డెన్ ఛాన్స్ ఛాన్స్ మీకు వస్తుంది. పాజిటివ్ థింకింగ్‌తో లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రశంసలు, ఆశీర్వాదాలు, సహాయం వంటివి పొందడం, ఇవ్వడంలోనూ చెప్పలేని ఆనందం ఉందటుంది. By Vijaya Nimma 13 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Happy Forever Tips:నేటి కాలంలో బీజీ లైఫ్ షెడ్యూల్ వలన చిన్న చిన్న ఆనందాలనూ చాలామంది కోల్పోతున్నారు. మరికొందరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలనే సందేహాలతో లైఫ్‌ని గడిపేస్తున్నారు. కానీ.. వాస్తవానికి సంతోషం అనేది మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు. ఒకరు ఇస్తే తీసుకునే సరుకు కాదు. సంతోషం అనేది మనం ఫీలయ్యే దానిని బట్టి ఉంటుంది. మనుషుల్లో హృదయాంతరాల్లోంచి బయటకు వచ్చేదే నిజమైన హ్యాపీనెస్ అని వైద్య నిపుణులు అంటున్నారు. జీవితంలో సంతోషంగా ఉండటానికి డబ్బు, హోదా, పలుకుబడి వంటివేవీ పనికి రావు. మీరున్న పరిస్థితినే కంఫర్ట్‌గా ఫీలవడం, చేసే పనుల్లోనే పరిపూర్ణతను ఆస్వాదించడం వంటి వాటితోనే దానిని సొంతం చేసుకోవచ్చు. అటువంటి అరుదైన పనులు, సందర్భాలు వంటి వాటి గురించి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన పనులు ➡పెద్దలు ఆనందమే జీవన మకరందం అంటారు. ఇది సంఘటనో, పట్టుబట్టి సాధించే విజయం కాదు. మీ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. ➡ఏవరైనా బాధాకరమైన దృక్పథానికి ప్రయారిటీ ఇస్తే జీవితంలో బాధలే ఎక్కువగా ఉంటాయి. ➡సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ పోతే సంతోషమనే స్వర్గంలో విహరించే అద్భుతమైన గోల్డ్ ఛాన్స్ మీకు వస్తుంది. ➡కొందరు ఉదయం వాకింగ్ చేస్తూ ఆనందం పొందితే.. మరి కొందరు ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకుంటు సంతోషాన్ని సొంతం చేసుకుంటారు. ➡అంతేకాదు జీవితంలో అందరిపట్ల, అన్ని విషయాలపట్ల సానుభూతి, కృతజ్ఞతా భావం కలిగి ఉంటే బోలెడంతా సంతోషం మీకు వస్తుంది. ➡ప్రశంసలు, ఆశీర్వాదాలు, సహాయం వంటివి పొందడం, ఇవ్వడంలోనూ చెప్పలేని ఆనందం ఉందటుంది. ➡ఇష్టమైన పనిలో మమేకం కావడం, ఇష్టమైన వ్యక్తులను చూడటం, మాట్లాడటం వంటి కూడా సంతోషాన్ని ఇస్తాయని అధ్యయనాలు పేర్కొంటాయి. ➡డైలీ ఎక్సర్‌సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా శరీరంలో ఆనందం హర్మోన్లు రిలీజ్ అయ్యేందుకు సహాయపడుతాయి. ➡పనిచేయడం, ఇష్టమైన వారితో టైం స్పెండ్ చేయడం, తినడం వంటి మెదడుని యాక్టివ్ అయి ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని రెట్టింపుగా పెంచుతాయి. ➡క్రమశిక్షణగా ఉండటం, టైంకి నిద్రపోవడం, భావోద్వేగాలను సందర్భానుసారంగా మెయింటెన్ చేయడం వలన మీలో సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. ➡ఇవన్నీ సానుకూలంగా భావిస్తూ, మనస్ఫూర్తిగా అంగీరించినప్పుడే సాధ్యమంటన్నారు నిపుణులు. ఇది కూడా చదవండి: పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు..ఈ ఇంటిచిట్కాలతో మీ బట్టలపై టీ మరకలు ఇట్టే పోతాయ్! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #happy #forever-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి