Relaxing Places: భాగస్వామితో రిలాక్స్‌ అవ్వాలంటే ఈ ప్లేస్‌లు బెస్ట్‌

ఉరుకులు, పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్‌లో పని ఒత్తిడి కారణంగా భాగస్వామితో సమయం గడపలేక శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారు. ప్రశాంతంగా భాగస్వామితో గడపాలంటే బాలి, మాల్దీవులు, వియత్నాం, న్యూజిలాండ్‌ వంటి ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం చాలా ఉత్తమం.

New Update
Relaxing Places: భాగస్వామితో రిలాక్స్‌ అవ్వాలంటే ఈ ప్లేస్‌లు బెస్ట్‌

Relaxing Places: తరచుగా ఇంటి పనులు, ఆఫీస్‌లో పని ఒత్తిడి కారణంగా భాగస్వామితో సమయం గడపడం కూడా కష్టంగా మారుతోంది. ఉరుకులు, పరుగుల జీవితంలో పని కారణంగా శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. అయితే ప్రశాంతంగా భాగస్వామితో గడపాలంటే విహారయాత్రలకు వెళ్లడం చాలా ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. ఒక వారం పాటు అన్ని పనుల నుంచి విరామం తీసుకొని ఇష్టమైన ప్రదేశానికి వెళ్లడం ద్వారా ఒత్తిడితో పాటు భాగస్వామితో రిలేషన్‌ పెరుగుతుందని సలహా ఇస్తున్నారు. విదేశాలకు వెళ్లాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని ఆలోచించాల్సిన అవసరం లేదు. బడ్జెట్‌లోనే వెళ్లగలిగే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.

publive-image

బాలి:

బాలి అనేది అందమైన లోయలతో పాటు మిమ్మల్ని విస్మయానికి గురిచేసే ఒక మంచి టూరిస్ట్‌ స్పాట్‌. బాలిలోని అందమైన బీచ్‌లలో ఎక్కువ సమయం గడిపవచ్చు. మీ జీవితాన్ని మళ్లీ శృంగారభరితంగా మార్చుకోవచ్చు. గతం కంటే బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. ఇక్కడి ఆహారం కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా మంది జంటలు ఇక్కడికి వస్తుంటారు.

publive-image

మాల్దీవులు:

చాలా మంది జంటలు మాల్దీవులకు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇక్కడ బీచ్‌లలో నిర్మించిన చిన్న కుటీరాల్లో మధుర క్షణాలను అనుభూతి చెందవచ్చు. ప్రకృతి అందాలకు మాల్దీవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది మంచి హనీమూన్ స్పాట్‌గా నిలిచింది.

publive-image

వియత్నాం:

వియత్నాం ఒక ఆగ్నేయాసియా దేశం. ఇది బీచ్‌లు, నదులు, బౌద్ధ దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. తక్కువ డబ్బుతో చాలా సరదాగా గడపాలనుకునే జంటలకు వియత్నాం మంచి టూరిస్ట్‌ స్పాట్‌. ఇక్కడి అందమైన బీచ్‌లలో శృంగార క్షణాలను గడపవచ్చు.

publive-image

న్యూజిలాండ్:

న్యూజిలాండ్‌ కూడా జంటలకు గొప్ప హనీమూన్ ప్లేస్‌గా ఉంది. నీలం రంగులో ఉండే సముద్రం, ఎత్తైన పర్వతాల్లో గడపడం రొమాంటిక్ అనుభూతిని ఇస్తుంది.

ఇది కూడా చదవండి: సీజన్‌ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు