Career : ఇంజనీరింగ్ లో టాప్ గ్రూప్ లు ఇవే! ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. అక్కడ 80.56శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 తాజాగా తెలిపింది. ఐటీ, సీఎస్ఈ చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించిది. By Bhoomi 27 Dec 2023 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇప్పుడు ఇంటర్ తర్వాత ఏంటని అడుగుతే డిగ్రీ కాదు..బీటెక్ మాత్రమేనని చెబుతారు. ఈరోజుల్లో విద్యార్థులు, పేరెంట్స్ అందరిదీ ఇదే మాట. అందులోనూ బీటెక్ లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఐటీ, కంప్యూటర్ సైన్స్ వైపు టాప్ ర్యాంకర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సహజంగా బీటెక్ పూర్తయిన తర్వాత కూడా వారే టాప్ ర్యాంకర్లుగా ఉన్నారు. ఉద్యోగ నైపుణ్యాల్లో కూడా ఐటీ, సీఎస్ఈ అభ్యర్థులు టాప్ లో ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కూడా వారికే ఎక్కువగా ఉన్నాయి. భారత నైపుణ్యాల నివేదిక 2024లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బీటెక్ లో ఐటీ, సీఎస్ఈ చదువుతున్న యువతో ఉద్యోగ నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 తెలిపింది. ఐటీలో 68.44 శాతం మంది విద్యార్థులు సీఎస్ఈలో 66శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఆ తర్వాత ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ గ్రూపులు ఉన్నాయి. సివిల్ గ్రూపులో చదివే విద్యార్థుల్లో కేవలం 54.31 శాతం మందికే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నట్లు తెలిపింది. చివరి ఆప్షన్ గా ఆ గ్రూపులో చేరుతున్నవారు చదువులో నైపుణ్యాల్లో కూడా వెకబడి ఉంటున్నారు. ఐటీయే టాప్: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐటీ రంగంలోనే అత్యధిక ఉద్యోగా అవకాలు ఉన్నాయి. వేతనాలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి. ఐటీ, సీఎస్ఈల్లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆయా గ్రూపుల్లో సీటు పొందలేని వారు ప్రత్యామ్నాయంగా ఇతర గ్రూపుల్లో చేరుతున్నారు. అందుకే పోటీ పరీక్షల్లో కూడా ఆ రెండు గ్రూపుల విద్యార్థులు ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రే టాప్: ఇక ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. అక్కడ 80.56 శాతం మంది విద్యార్థుల్లో నైపుణ్యాలున్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 వెల్లడించింది. ఏపీలో 73.23శాతం మంది విద్యార్థుల్లో స్కిల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కేరళ 68.36శాతంతో మూడో స్థానంలో నిలిచింది. కొలువుల విషయానికి వచ్చినట్లయితే...2024లో ఉద్యోగనియామకాలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో కర్నాటక మొదటిస్థానంలో ఉందని జాతీయ నివేదిక వెల్లడించింది. ఎక్కువ ఉద్యోగాల కల్పనలో కర్నాటక తర్వాత, ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఈ జ్యూస్ క్రమంతప్పకుండా తాగుతే..వయస్సు పెరగదు..షుగర్ రాదు..కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది..!! #jobs #career #employment #btech #top-groups #skills మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి