లివర్ సమస్యల్ని ఈ ఫుడ్స్ తో దూరం చేయండి.. సాధారణంగా లివర్ డ్యామేజ్ అయితే, దానిని గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే దీనిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొదటిదశలోనే గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి. By Durga Rao 16 May 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి మన బాడీలో లివర్ 500 కంటే ఎకకువ పనులు చేస్తుంది. లివర్ పాడైనప్పుడు దానికదే రిపేర్ చేసుకుంటుందనిన మీకు తెలుసా. లివర్‌కి ఏ సమస్య ఉండి 40 నుంచి 50 శాతం దానిని వేరుచేసినప్పటికీ, అవి తిరిగి పూర్తిగా 100 శాతంగా పెరుగుతాయి. అలాంటి లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ప్రమాదమనే చెప్పొచ్చు. మరి వాటి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెబుతున్నారు డా. వివేకానంద. ఈయన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఎల్‌టిఎస్ఐ), సిమ్స్ హాస్పిటల్స్, వడపళని, చెన్నైలో విధులు నిర్వహిస్తున్నారు. కాళ్ళ వాపు,కడుపులో నీరు చేరడం,రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం,పగటి పూట నిద్ర రావడం,అలసట,కామెర్లు ఇవన్నీ కూడా మొదట్లో కనిపించే లక్షణాలు. వీటిని చాలా మంది పట్టించుకోరు. ఈ సందర్భంలో లివర్ 30 నుండి 40 శాతం వరకూ పనిచేయదని చెప్పొచ్చు.. మన దేశంలో లివర్‌కి ప్రధానంగా 3 సమస్యలు వస్తాయి.వాటిలో ముఖ్యంగా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్,ఫ్యాటీ లివర్,వైరల్ హెపటైటిస్ ప్రధానంగా ఉన్నాయి.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, మలేరియా, ఎయిడ్స్‌ని ప్రభావితం చేసే వైరస్ ఏదైనా ఉందంటే అది హెపటైటిస్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా సంవ్సతరానికి 15 లక్షల మంది మరణిస్తారు. ఈ మరణాలన్నీ లివర్ ప్రాబ్లమ్స్ వల్లే.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మన దేశంలోనే ీ సమస్య ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లోనూ ఆల్కహాల్ తీసుకున్నా.. అది లిమిటెడ్‌గా ఉంటుంది. మన దగ్గర దీనిని ఎక్కువగా పట్టించుకోరు. ఆల్కహాల్ లివర్‌పై ఎఫెక్ట్ చూపించినప్పుడు దీనిని పూర్తిగా నివారించాలి. అప్పుడే లివర్ కోలుకుంటుంది. దీనికోసం ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల ఆ సమస్యని తగ్గించుకోవచ్చు.మన దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి కొవ్వు, ఆహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ సమస్య వచ్చిందంటే లివర్ కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి, ముందు నుంచి దీని విషయంలో జాగ్రత్త అవసరం.మనం తీసుకునే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని ప్రాసెస్ చేస్తారు. కార్బోహైడ్రేట్స్ అనేవి సాధారణ ఫుడ్స్. ఇందులో ప్రోటీన్ ఉండదు. కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ, అందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి చాలా మంచిది. #liver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి