Immunity: రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్‌ ఇవే.. తప్పక తినండి

కోవిడ్ కాలం తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రస్తుత కాలంలో కొత్త రకాల ఇన్ఫెక్షన్లు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. సిట్రస్ పండ్లు, ట్యూనా ఫిష్‌, కివి, పాలకూర, వెల్లుల్లి, బ్రోకలీ వంటివి ఆహారంలో చేర్చుకుంటే రోగనిరోధన శక్తి పెరుగుతుంది.

New Update
Health Tips: మండే ఎండల్లో మీ శరీరాన్ని చల్లగా ఉంచే ఫుడ్స్ ఇవే.!

Immunity: కోవిడ్ అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచింది. ప్రస్తుత కాలంలో కొత్త రకాల ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటి నివారణకు ఎన్నో జాగ్రత్తలతోపాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం కూడా ఎంతో ముఖ్యం. గతంలో ఉక్కిరిబిక్కిరి చేసిన కోవిడ్-19 ఇప్పటికి మనల్ని వదలటం లేదు. కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ JN.1 కేసులు భారతదేశంలో పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ కేసులు తీవ్రమైన ఆందోళన పడుతున్న జనం దీనిని నివారించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకుంటున్నారు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కొన్ని ఆహార పదార్థాలున్నాయి. ఈ ఆహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే కరోనా, ఫ్లూ, జలుబు మొదలైన ఇతర వ్యాధుల నుంచి బటయ పడుతాం ఆహారంలో ఏయే ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా వాటిని బలపరచవచ్చు, ఏయే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయో ఇప్పుడు కొన్ని విషయలు తెలుసుకుందాం.

సిట్రస్ పండ్లు:

  • సిట్రస్ పండ్లలైన నారింజ, నిమ్మ, టాన్జేరిన్, ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

ట్యూనా ఫిష్‌:

  • ఒమేగా -3 ఆమ్లాలు ట్యూనా, మాకేరెల్, సార్డిన్ మొదలైన చేపలలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

బ్రోకలీ:

  • బ్రోకలీలో చాలా విటమిన్లు, ఖనిజాలున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనిని తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు.

కివి:

  • కివి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో ఉండే ఫోలేట్, విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాదు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. దీనిని ఆహారంలో చేర్చుకోవడం అనేక ప్రయోజనాలున్నాయి.

పాలకూర:

  • పాలకూరలో విటమిన్ సి, ఇ, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కావున.. దీనిని తింటే వ్యాధులు రాకుండా ఉంటాయి.

వెల్లుల్లి:

  • వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ వాపు తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వీటిల్లో యాంటీ-ఆక్సిడెంట్లు, కనిపిస్తాయి, ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

 ఇది కూడా చదవండి: మీ పిల్లలు సరిగా తినడం లేదా..కారణం ఇదే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు