భర్త పర్సనల్ విషయాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు.. కర్ణాటక హైకోర్టు భార్యభర్తల వ్యక్తిగత విషయాలకు సంబంధించి కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రిలేషన్ లో ఉన్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని తెలిపింది. By srinivas 29 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి విడాకుల అనంతరం తన భర్త అభరణం ఇవ్వడం లేదని, అతని వ్యక్తిగత వివరాలు కావాలంటూ ఓ మహిళ వేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆధార్ కార్డు వివరాలను తెలియజేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) ద్వారా చేసిన భార్య రిక్వెస్ట్ ను తిరస్కరించింది. ఆమెకు అతడి వివరాలు ఇవ్వాల్సిన అవసరంలేదని, భర్తకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. Also read :Breaking: ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ సక్సెస్.. బయటికి వచ్చిన 41 మంది కార్మికులు.! ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక హైకోర్టు హుబ్బళ్లికి చెందిన మహిళకు 2005లో వివాహమైంది. కుమార్తె పుట్టాక దంపతులు విడిపోయారు. కుటుంబ న్యాయస్థానం ఆదేశానికి అనుగుణంగా భరణాన్ని తన మాజీ భర్త ఇవ్వడం లేదని గృహిణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన ఆధార్ కార్డు వివరాలను తెలియజేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్)కు విన్నవించారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఈ వివరాలు ఇవ్వలేమని 2021 ఫిబ్రవరి 25న దరఖాస్తును ఉడాయ్ తిరస్కరించింది. సంస్థ నిర్ణయంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు ఆధార్ వివరాలు అందించాలని హైకోర్టు.. ఉడాయ్‌ను 2023 ఫిబ్రవరి 8న ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై ఉడాయ్ మళ్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తేనే ఆధార్ నంబరు, ఇతర వివరాలను తెలియజేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిందని సంస్థ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉడాయ్‌కు అనుకూలంగా ధర్మాసనం తీర్పునిచ్చింది. భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు తెలపాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వివాహ బంధంలో కొనసాగుతున్నా, విడిపోయినా భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు అవకాశం లేదని జస్టిస్ ఎస్.సునీల్‌దత్ యాదవ్, జస్టిస్ విజయకుమార్ ఏ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది. #wife #husband #personal-details #karnataka-high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి