CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు!

సీబీఎస్ఈ(2024-2025)  11వ , 12వ తరగతి ప్రశ్నా పత్రాలలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయ విశ్లేషణ ప్రశ్నలను 40 నుంచి50 శాతానికి పెంచనున్నారు. విద్యార్థుల పరిజ్జాన్ని పరీక్షించే లఘ.దీర్ఘ కాల ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు.

New Update
CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు!

Question Paper Changes : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 11వ తరగతి, 12వ తరగతి పరీక్షల్లో ముఖ్యమైన మార్పు చేస్తున్నట్లు అధికారులు తెలపారు. జాతీయ విద్యా విధానం(NEP) 2020 ప్రకారం CBSE ద్వారా ఈ మార్పును చేస్తున్నారు. CBSE 11వ మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలలో ఇప్పుడు మరిన్ని ఆప్టిట్యూడ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. , 11వ మరియు 12వ తరగతులలో MCQలు/కేస్ ప్రశ్నలు,  ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు ,ఆప్టిట్యూడ్-ఫోకస్డ్ ప్రశ్నల సంఖ్య అంటే( విషయ విశ్లేషణ సామర్థ్యం ప్రశ్నలు ) 40 శాతం నుండి 50 శాతానికి పెంచనున్నారు.

మరోవైపు, 2024-25 అకడమిక్ సెషన్‌లో సెట్ చేసిన  ప్రశ్నలు విద్యార్థుల సామర్థ్యాన్ని పరిక్షించేవి లఘు దీర్ఘ సమాధానాల తరహా ప్రశ్నలను  40 శాతం నుండి 30 శాతానికి తగ్గించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, కొత్త అకడమిక్ సెషన్ (2024-25) కోసం 9వ, 10వ తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్ష ప్రశ్నపత్రాల నిర్మాణంలో ఎలాంటి మార్పు కనిపించలేదు.

"21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థుల సృజనాత్మక, క్లిష్టమైన , వ్యవస్థల ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించే  అభ్యాసానికి దూరంగా ఉండే విద్యా పర్యావరణ వ్యవస్థను రూపొందించడం బోర్డు  ప్రధాన లక్ష్యం" అని తెలిపింది. ఇంతలో, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) 3వ తరగతికి సంబంధించిన కొత్త NCF-SE 2023 పాఠ్యపుస్తకాలు ఏప్రిల్ 2024 నాటికి , 6వ తరగతికి 2024 మే మధ్య నాటికి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అన్ని NCERT పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలు NCERT పోర్టల్, దీక్ష మరియు ePathsala పోర్టల్  యాప్‌లో ఉచితంగా లభించనున్నాయి.

Also Read : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు