Vangalapudi Anitha: రాష్ట్రంలో పిచ్చికుక్క పాలన సాగుతోంది.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్‌ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Vangalapudi Anitha: రాష్ట్రంలో పిచ్చికుక్క పాలన సాగుతోంది.. వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్‌ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలవడానికి ఆయన భార్య భువనేశ్వరి వెళ్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని అనిత మండిపడ్డారు. గతంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ను తన భార్య కలవకుండా పోలీసులు అడ్డుకున్నారా అని ఆమె ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబును ఉంచిన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని ఆనిత మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రికి కనీస వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ ఏమి చేస్తోందని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అసలు ఖాళీగా ఉండరన్న ఆమే.. ఆయన ఖాళీగా లేని సమయంలో పథకాలు సృష్టించారన్నారు. ప్రస్తుతం జైల్లో ఖాళీగా ఉన్న చంద్రబాబు రానున్న రోజుల్లో ప్రజల కోసం ఇంకా ఎన్నో పథకాలు సృష్టిస్తారని అనిత వెల్లడించారు. దానిని ఇప్పుడు ఎగిరి ఎగిరి పడుతున్న వైసీపీ నేతలు చూస్తుంటారన్నారు. మరోవైపు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనిత రాష్ట్రంలో పిచ్చి కుక్కలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం వల్లే ఇలాంటి దుస్థితి నెలకొందన్నారు.

కొందరు వైసీపీ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు. మంత్రి పదవిలో ఉండటానికి కూడా అర్హత లేని వ్యక్తులు సైతం ఈ నేరస్తుడి మంత్రివర్గంలో ఉన్నారన్నారు. దీంతో రాష్ట్రంలో కొనసాగే పాలన మొత్తం నేర పూరితంగా మారిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రౌడీ, ఫ్యాక్షన్‌ పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఆమె.. జగన్‌ పాలనలో ప్రజలు ఎన్నో అవమానాలుకు గురయ్యారన్నారు. కొత్త కొత్త స్కీమ్‌లతో ప్రజలను దోచుకున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలు జగన్‌కు తగిన బుద్ది చెబుతారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు