The Vaccine War: అప్పుడు కశ్మీర్ ఫైల్స్... ఇప్పుడు వ్యాక్సిన్ వార్

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇప్పుడు డైరక్టర్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సంచలన నిజాల్ని బయటపెడతానంటూ ఓ సినిమా తీశాడు ఈ డైరక్టర్. ఆ సినిమా పేరు వ్యాక్సిన్ వార్.

New Update
The Vaccine War: అప్పుడు కశ్మీర్ ఫైల్స్... ఇప్పుడు వ్యాక్సిన్ వార్

The Vaccine War: ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇప్పుడు డైరక్టర్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సంచలన నిజాల్ని బయటపెడతానంటూ ఓ సినిమా తీశాడు ఈ డైరక్టర్. ఆ సినిమా పేరు వ్యాక్సిన్ వార్.

The Vaccine War

విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సాధించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' తర్వాత సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి భారతదేశపు మొట్టమొదటి బయో-సైన్స్ చిత్రం 'ది వ్యాక్సిన్ వార్'తో వస్తున్నారు. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్‌పై పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు 'ది కాశ్మీర్ ఫైల్స్' కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ ఈ ప్రాజెక్ట్‌కు కూడా నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

The Vaccine War

కోవిడ్-19 అనే కోర్ పాయింట్, వ్యాక్సిన్ డ్రిల్స్ గురించి కొన్ని అధ్యయనాలను ఆసక్తిరేకెత్తించేలా ప్రజంట్ చేసింది ట్రయిలర్. వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించే ఛాలెంజ్‌ని స్వీకరించిన సైంటిస్ట్ హెడ్ నానా పటేకర్‌తో వీడియో ప్రారంభమవుతుంది. దేశ భద్రత దృష్ట్యా ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలని ఆయన ఉన్నతాధికారులను కోరుతారు. దేశవాళీ వ్యాక్సిన్‌పై ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారంటూ ఓ జర్నలిస్ట్ వ్యాఖ్యానించే సన్నివేశం ట్రైలర్‌లో ఉంది. జర్నలిస్ట్ పాత్రని రైమా సేన్ పోషించింది.

The Vaccine War

ట్రైలర్ అంతా యంగేజింగ్‌గా ఉంది. ప్రతీ సన్నివేశం ఆసక్తిని రేపింది. ఈ చిత్రంలో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ సాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ తదితరులు నటిస్తున్నారు. 'వ్యాక్సిన్ వార్' హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీలతో సహా 10కి పైగా భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

The Vaccine War

నిజానికి ఈ సినిమాకు బాక్సాఫీస్ బరిలో భారీ పోటీ ఉంటుందని భావించారు. ఎందుకంటే, వ్యాక్సిన్ వార్ రిలీజైన 24 గంటల తేడాలో సలార్ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే సలార్ పోస్ట్ పోన్ అవ్వడంతో, వ్యాక్సిన్ వార్‌కు లైన్ క్లియర్ అయింది. ఆ తేదీకి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమా ఇదొక్కటే.

Also Read: గుంటూరు కారం.. మరో డిసప్పాయింట్ మెంట్

Advertisment
Advertisment
తాజా కథనాలు