TS Police Warning: పండుగకు ఉరెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే మీ ఇల్లు ఖాళీ..!! దసరా పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో ప్రజలంతా తమ తమ ఊళ్లకు వెళ్తున్నారు. పండగ సీజన్ కదా..దొంగలకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. దాని కోసం డబ్బు కావాలి. అందుకే పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లపై కన్నేస్తారు. ఉన్నదంతా దోచేస్తుంటారు. ఇంతకుముందు అయితే ఇలా పండగల సమయంలో పోలీసులు ఇళ్లపై దృష్టి సారించేవారు. దొంగతనాలు జరగకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం. పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. ఇది దొంగలకు మంచి సమయం. దొరికనకాడికి దోచుకెళ్తారు. మీరు ఇలా వెళ్లాగానే...వాళ్లు అలా వచ్చేస్తారు. అందుకే పండగకు ఊరెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. By Bhoomi 18 Oct 2023 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దసరా పండుగ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ప్రజలు తమ తమ ఊర్లకు వెళ్తుంటారు. దీంతో కాలనీలన్నీ నిర్మాణుష్యంగా మారుతాయి. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. దసరాకు తోడు ఎన్నికలు ఉండటంతో పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. శివారు ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతుంటారు. ఈ క్రమంలో ఊరెళ్తున్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ కమిషన్ చెబుతున్నారు. పండక్కి ఊరెళ్లేవారు ఇళ్లు గుల్ల కాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి: 1. ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించేవారిపై నిఘా పెట్టండి. 2. రాత్రయితే అనుమానంగా సంచరించేవారిని పలుకరించండి. 3. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం, రాత్రి వేళ చోరీలకు పాల్పడుతుంటారు. ఇది కూడా చదవండి: త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి..తెలంగాణ నేతకు కీలక పదవి…!! 4. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదు. 5. ఇరుగుపొరుగు వారిని ఇంటిని కనిపెట్టమని చెప్పి వెళ్లండి. 6. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా ప్లాన్ చేసుకోండి. 7. పక్కంటివారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది. 8. ఇంట్లో కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, అపరిచితుల సమాచారం పేరుతో వస్తే నమ్మకండి. 9. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకపోవడమే మంచిది. లేదంటే బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవడం మంచిది. 10. కాలనీల వారిగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి. 11. తాళం వేసి ఊరు వెళ్లే ముందు పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వండి. 12. పోలీస్ శాఖ వారికి దొంగతనాలపై అనుమానితు సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించండి. ఇది కూడా చదవండి: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!! 13. ప్రత్యేకంగా మీ చుట్టు పక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబర్ , సెల్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోండి. 14. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100ను సద్వినియోగం చేసుకోండి. #dasara #ts-police-warning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి