Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావం ఇప్పుడు రైల్వే శాఖ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు 305 రైళ్లను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు అధికారులు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ప్రయాణికులకు ఎస్ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని మిచౌంగ్‌ తుఫాన్ ముంచెత్తింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బాపట్ల వద్ద తుఫాన్‌ తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మీద కూడా పడినట్లు అధికారులు తెలిపారు.

తుఫాన్‌ కారణంగా సుమారు 305 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ప్రకటించారు. ఈ క్రమంలోనే సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో రైళ్ల పై తుఫాన్‌ ఎఫెక్ట్‌ పేరిట ఓ ప్రకటనను అధికారులు విడుదల చేశారు. రద్దు చేసిన రైళ్లు కాకుండా మరో 10 రైళ్లను గూడూరు , చెన్నై రూట్లలో కాకుండా ఇతర రూట్లలో దారి మళ్లించినట్లు అధికారులు వివరించారు.

ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా వారు ఓ మెసేజ్‌ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం రైలు పట్టాల పై ఎక్కడా కూడా నీరు నిలబడలేదు. కానీ ముందుగానే నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్లు క్యాన్సిల్‌ అయినట్లు సమాచారం అందించినట్లు అధికారులు వివరించారు. ఎస్‌ఎంఎస్‌లు, సోషల్‌ మీడియా ద్వారా సమాచారాన్ని అందించారు.

ఇప్పటికే చాలా మంది ప్రయాణికులకు రిజర్వేషన్‌ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్‌ తీరం దాటిన తరువాత వీలైనంత త్వరగా రైళ్లను తిరిగి నడుపుతామని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు.

Also read: మిచౌంగ్‌ ఎఫెక్ట్‌ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు