Health Tips: మగవారికి పొంచిఉన్న ముప్పు..ఆ సమస్య తప్పదా..?

మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. జీవనశైలిలో మార్పులతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Health Tips: మగవారికి పొంచిఉన్న ముప్పు..ఆ సమస్య తప్పదా..?

Prostate Cancer: మగవారి పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం సంవత్సరానికి 14 లక్షల మంది మగవారు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 3.75 లక్షల మంది చనిపోతున్నట్టు తేలింది. 2020 వరకు ప్రపంచంలో కేసులు, మరణాలపై డబ్ల్యూహెచ్‌వోలో (WHO) భాగంగా ఉన్న ఐఆర్‌సీ పరిశోధకులతో కలిసి అధ్యయనం జరిపింది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు 2020 నుంచి 2040 మధ్య రెట్టింపు కంటే అధికం అవుతాయని అంచనా వేస్తున్నారు.

Prostate Cancer

ఇప్పుడు నమోదవుతున్న కేసుల కంటే మరో 85% పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అత్యధిక మరణాలు కూడా ఉంటాయని అంటున్నారు. 2040 వరకు సంవత్సరానికి 29 లక్షల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏడాదికి 7 లక్షల మంది మగవారు మరణిస్తారని అంటున్నారు. జీవనశైలిలో మార్పులతో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ ఇవ్వడం వల్ల ముప్పు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
Prostate Cancer

ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..?

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అనేది అధికంగా వయసు మీదపడిన వారిలోనే కనిపిస్తోంది. దీనికి నివారణ లేదు అయితే ముందస్తుగా కొన్ని పరీక్షలు చేయించుకుంటే చికిత్స చేసుకుని బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. 50 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ప్రొస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ టెస్టులు (Prostate-Specific Antigen Test) చేయించుకోవాలి. 60 ఏళ్లు పైబడినవారిలో ఈ రిస్క్‌ బాగా ఎక్కువగా ఉంటుందని, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కడుపులో గడ్డలు ఉన్నట్టే..జాగ్రత్త

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు