రేపటి నుంచి విశాఖలో వారాహి మూడో దశయాత్ర

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొదలు పెట్టిన వారాహి యాత్ర రెండు విడతలు విజయవంతం అయిన విషయం తెలిసిందే. యాత్రను సక్సెస్‌ ఫుల్‌గా చేసిన నేపథ్యంలో మూడో విడత యాత్రకు సిద్ధమైయ్యారు. రెండు దశలో ఏపీ ప్రభుత్వంపై విరుచుక పడిన పవన్‌.. ఇప్పడు విశాఖ మూడో వారాహి యాత్రపై వైసీపీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది.. పవన్‌ కౌంటర్‌కు.. ఏపీ అధికారుల రీకౌంటర్‌ ఎలా ఉంటుదో ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

New Update
రేపటి నుంచి విశాఖలో వారాహి మూడో దశయాత్ర

పళ్యాణ్‌ కళ్యాణ్‌ మూడో విడత వారాహి విజయ యాత్రం( Varahi Yatra)  రేపు విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. వారాహి యాత్ర విజయం కోసం సింహాద్రి అప్పన్న (Simhadri Appanna) కొండపైకి మోకాళ్ళతో మెట్లు ఎక్కిన జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు  (గురువారం) ప్రారభమై.. ఈనెల 19 వరకు కొనసాగనుంది. అయితే వారాహి యాత్ర మూడో విడత విజయం సాధించాలని జనసైనికులు సింహాచలం తొలి పావంచ వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. మెట్లు మార్గం గుండా మోకాళ్ళతో పైకి ఎక్కి సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నం యాత్ర దిగ్విజంగా సాగాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే 10 రోజుల పాటు విశాఖలో అనేక అంశాలను పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ప్రస్తావన చేయనున్నారు. వారాహి యాత్ర కోసం ఇప్పటికే పోలీసు శాఖ వారిని అన్ని అనుమతులు కోరినట్లు తెలుస్తోంది. రుషికొండ, ముదపాక, విస్సన్నపేట ప్రాంతాలను సందర్శించిన పవన్‌ కళ్యాణ్‌, స్టీల్ ప్లాంట్, గంగవరం, కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్నారని తెలిసి వైసీపీ నాయకుల్లో దడ పట్టుకుంది. రేపటి నుండి యాత్ర మొదలవుతోంది. అయినా ఇంతవరకు కూడా రూట్ మ్యాప్ పోలీసులు ఇవ్వలేదు. ఎవరు ఎన్ని అడ్డంగా సృష్టించిన జనసేనాని వారాహి యాత్ర ఎవరు ఆపలేరని జనసేనుకులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో విడత వారాహి యాత్ర కోసం జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ సమన్వయకర్తగా మల్నీడి తిరుమరావును నియమించగా.. క్యాటరింగ్ కమిటీ సభ్యులుగా బండి రామకృష్ణ, మధు వీవరేశ్, కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, రామారావు, గర్భాన సత్తిబాబు, గల్లా తిమోతి, మేడిద దుర్గాప్రసాద్, పట్టాభిరామయ్య, మాగాపు వీర్రాజు, మోండా శివప్రసాద్‌లను నియమించింది.

ఇక.. విశాఖలో పవన్ వారాహి యాత్ర (Varahi Yatra) ను విజయవంతం చేయాలని జీవీఎంసీ చెత్త వాహనంతో ప్రచారం చేస్తున్నారు. జగదాంబ సమీపంలో ఉన్న 37వ వార్డులో ఒక పక్క చెత్త సేకరిస్తూ మరో పక్క పవన్ సభను జయప్రదం చేయాలని ఓ డ్రైవర్ విజ్ఞప్తి చేస్తున్నారు. జీవీఎంసీ వాహనంలో జనసేన ప్రచారం చూసి విశాఖ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అయితే..రేపు సాయంత్రం 5 గంటలకు విశాఖలోని జగదాంబ కూడలిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం జానవాణి కార్యక్రమం, క్షేత్రస్తాయి పర్యటన కూడా ఉంటుందని పేర్కొన్నారు. గంగవరం పోర్టు, తదితర ప్రాంతాలలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని.. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 9 రోజులపాటు ఈ వారాహియాత్ర సాగుతోందని జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిన శివశంకర్ వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment