పాఠశాలకు హిజాబ్ వద్దంటున్న టీచర్స్..చంపేస్తామంటున్న పేరెంట్స్! తరగతి గదిలోకి హిజాబ్ ధరించి రావద్దని చెప్పిన ఉపాధ్యాయులను విద్యార్థినుల తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ఘటన బిహార్ లోని శేఖ్‌పూర్ లో జరిగింది. By Bhavana 03 Dec 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి హిజాబ్ ధరించి తరగతిలోకి రావద్దని ఓ విద్యార్థినికి సూచించిన ఉపాధ్యాయులను చంపేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులు బెదిరించారు. ఈ ఘటన బిహార్ లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..బిహార్ లోని శేఖ్‌పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను వాటిని తొలగించి తరగతి గదిలోనికి రావాలని తెలిపారు. దీంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు పాఠశాలకు హిజాబ్ తొలగించాలని తెలిపిన ఉపాధ్యాయులను చంపేస్తామని బెదిరించారు. ఆ విషయం గురించి శేఖ్‌పురా డీఈవో ఓం ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. తరగతి గదిలో హిజాబ్ తొలిగించాల్సిందిగా సూచించినందుకు విద్యార్థినీల కుటుంబ సభ్యులు బెదిరించారని జిల్లాలోని చారువా సెంకడరీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో సంబంధిత విద్యార్థినుల కుటుంబాల వారు పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగడంతో పాటు, ఉపాధ్యాయులను బెదిరించారని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ ఆచార వ్యవహారాలకు అడ్డుపడితే పాఠశాలను నడపనివ్వమని ..తలలు నరికేస్తామని హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం గురించి శాఖా పరమైన విచారణ జరిపించి..నివేదిక అందించాలని కోరారని డీఈవో తెలిపారు. అలానే తరగతి గదుల్లో ఎలాంటి ముసుగులను అనుమతించమని..కాదని బలవంతుపు చర్యలకు దిగి ఒత్తిడి చేస్తే చట్టాన్ని ఆశ్రయిస్తామని ప్రిన్సిపాల్ తెలిపినట్లు డీఈవో వివరించారు. Also read: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రస్ట్ బోర్డు! #bihar #teachers #hizab మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి