Purandeswari vs Gvl : రసవత్తరంగా మారిన విశాఖ సీటు..కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్

ఏపీ రాజకీయాల్లో విశాఖ ఎంపీ సీటు ఇప్పుడు రసవత్తరంగా మారింది. సీటు తనకంటే తనకంటూ పురందేశ్వరి, జీవీఎల్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరితే ఆ సీటు ఎవరికనే సస్పెన్స్ కొనసాగుతుంది.

New Update
Purandeswari vs Gvl : రసవత్తరంగా మారిన విశాఖ సీటు..కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ లో రసవత్తర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎంపీ సీటు విషయంలో బీజేపీలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ సీటు కోసం బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని పురంధేశ్వరి భావిస్తుండగా తనకు కూడా అదే సీటు కావాలని జీవీఎల్ తేల్చి చెబుతున్నారు. దానికి అనుగుణంగానే గడచిన రెండేళ్లుగా అక్కడి నుంచే జీవీఎల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేలా జీవీఎల్ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో విశాఖ నుంచి గెలిచిన అనుభవం పురంధేశ్వరికి ఉంది. అయితే ఏ పార్టీతో పొత్తు ఉన్న విశాఖ సీటు బీజేపీకే ఇవ్వాలని వారిరువురు కోరుతున్నారు.  మరోవైపు జనసేన కూడా విశాఖ సీటు తమకే కేటాయించాలని చంద్రబాబును కోరుతున్నాయి.

ఇది కూడా చదువండి :Chandrababu: చంద్రబాబు కేసు విచారణ… చివరిలో ఊహించని ట్విస్ట్!

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ వరుసగా అభ్యర్థుల లిస్టులు విడుదల చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం పొత్తు విషయం ఇంకా తేలలేదు. వైసీపీ ఇప్పటికే చాలామంది అభ్యర్థులను మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తుంది. సీటు దక్కని వారు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధం పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో అసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇది కూడా చదువండి : Film Nagar Murder : వివాహితను ప్రేమించానని వెంటపడి..భర్తను చంపిన ప్రేమోన్మాది

ఒకవైపు టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించగా, బీజేపీ, జనసేన మధ్య కూడా స్నేహం కొనసాగుతుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనుకుంటే మాత్రం విశాఖ సీటు ఎవరికీ కేటాయిస్తారనేది తేలాల్సిన అంశం. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు విషయం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ క్రమంలో మూడు పార్టీల్లో విశాఖ సీటు ఎవరికిస్తారనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. ఏదేమైనా ఆ విషయాన్నిఆయా పార్టీల అధిష్ఠానాలే నిర్ణహిస్తాయని  నాయకులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు