/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T184438.014.jpg)
ఎలక్ట్రానిక్స్‌పై రిమూవబుల్ బ్యాటరీలను తప్పనిసరి చేయాలని భావిస్తున్న ఇన్‌కమింగ్ ఈయూ నిబంధనలకు రాబోయే ఐఫోన్లలో బ్యాటరీని రిప్లేస్ చేయడానికి ఆపిల్ కొత్త మెథడ్‌పై పనిచేస్తోందని సమాచారం. “విద్యుత్ ప్రేరిత స్టిక్కీ డీబాండింగ్” టెక్నాలజీతో వినియోగదారులను బ్యాటరీకి ఒక కొద్దిగా విద్యుత్తును అందించడం ద్వారా ఐఫోన్ లోపలి నుంచి బ్యాటరీని తొలగించడానికి అనుమతిస్తుంది.
ఆపిల్ ప్రస్తుత ఐఫోన్ మోడల్‌లు రేకుతో కవర్ చేసిన బ్యాటరీలతో అమర్చి ఉంటాయి. ఈ బ్యాటరీ లేయర్‌పై అంటుకునే స్ట్రిప్స్‌ని ఉపయోగిస్తారు. అంటే.. వినియోగదారులు హ్యాండ్‌సెట్ ఫ్రేమ్ నుంచి యూనిట్‌ను బయటకు తీయడానికి పట్టకార్లను ఉపయోగించాలి. యూజర్ ఫ్రెండ్లీ ప్రక్రియ కాదని గమనించాలి. మీరు ఆపిల్ సపోర్టు పేజీలో దీని గురించి మరింత తెలుసుకోవచ్చు.
నివేదిక ప్రకారం.. కంపెనీ ఫ్యూచర్ ఐఫోన్ బ్యాటరీలను రేకుకు బదులుగా మెటల్‌తో తీసుకురానుంది. కొత్త టెక్నాలజీ బ్యాటరీని సులభంగా రిమూవ్ చేయగలిగేలా అవసరమైతే మరో బ్యాటరీ రిప్లేస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ నుంచి బ్యాటరీని బయటకు తీయడానికి ప్రయత్నించడం కన్నా ఇది చాలా సులభం అయినప్పటికీ, కంపెనీ యూజర్లకు వారి సొంతంగా రిపేర్లు చేయవద్దని సూచనలు చేస్తోంది.
ఈ సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఒక మోడల్‌ను సులభమైన బ్యాటరీలతో రీప్లేస్ చేయాలని ఆపిల్ యోచిస్తోందని నివేదిక పేర్కొంది. అయితే టెక్నికల్‌గా వచ్చే ఏడాది అన్ని మోడళ్లలో ఈ తరహా బ్యాటరీ అందుబాటులో ఉండనుంది. గత ఏడాదిలో మెటల్ షెల్‌తో ఐఫోన్ 16 ప్రో బ్యాటరీ ఫొటో ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఆపిల్ ఫోన్లను ఆవిష్కరించే వరకు హార్డ్‌వేర్ మార్పులు, అప్‌గ్రేడ్స్ వివరాలను రివీల్ చేయదు. రాబోయే నెలల్లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ సమయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.