Skill Development Case : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ నెల16న కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. By Madhukar Vydhyula 13 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case) లో జనవరి 16న సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. స్కీల్ కేసులో ఎఫ్ఐ ఆర్ రద్దుచేయాలంటూ చంద్రబాబు పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో ఎఫ్ఐ ఆర్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 17 ఏ వ్యవహారంలో చంద్రబాబు పిటిషన్‌పై.. సుప్రీంకోర్టు (Supreme court) మంగళవారం తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. స్కిల్ కేసులో అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసిన విషయం తెలిసిందే. స్కిల్ కేసులో ఎఫ్ఐ ఆర్ రద్దు చేయాలంటూ సుప్రీంలో చంద్రబాబు నాయుడు పిటిషన్ వేశారు. 17 ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా..కేసు నమోదు చేయడం కుదరదని చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 16న ఉదయం పదిన్నర గంటల సమయంలో సుప్రీం ధర్మాసనం తుది తీర్పను ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడుపై ఫైబర్‌నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఫైబర్‌నెట్ కేసులోను ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 17ఏతీర్పు తర్వాత ఫైబర్‌నెట్ కేసు విచారణ చేపడతామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు సూచించింది. #skill-development-case #supreme-court #chandra-babu-naidu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి