చిరుతదాడి నుంచి తప్పించుకున్న పెంపుడు కుక్క..సీసీటీవిలో రికార్డైన దృశ్యాలు! కర్ణాటకలోని బళ్లారి సొరనూర్ లో చిరుత కదలికల దృశ్యాలను ఓ పెంపుడు కుక్క పట్టించింది.స్థానిక వ్యక్తి పొలంలోని మేకల ఫాం వద్ద ఉండే కుక్కపై చిరుతదాడికి యత్నించటంతో ఆ కుక్క యజమాని ఇంటి వద్దకు పరుగుతీసింది.కుక్క రావటం చూసి సీసీటీవి చెక్ చేసిన ఆయనకు చిరుత దృశ్యాలు కనిపించాయి. By Durga Rao 09 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కర్ణాటకలోని బళ్లారి సొరనూర్ లో గ్రేనహళ్లి అనే వ్యక్తి నిసిస్తున్నాడు. అతనికి గ్రామానికి 100 మీటర్ల దూరంలో మేకల ఫారం ఉంది. అతని పెంపుడు కుక్క పొలం ముందున్న గట్టుమీద నిద్రపోతు ఉంది.ఆ సమయంలో చిరుత పులి అక్కడికి వచ్చి కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన కుక్క చిరుతపులి నుంచి తప్పించుకుని మెరుపు వేగంతో గ్రామంలోకి పరుగెత్తి ఇంటికి వచ్చింది. ఎప్పుడూ ఇంటికి రాని కుక్క ఈరోజు వేగంగా పరుగెత్తడం చూసి హొన్నూర సామి ఆశ్చర్యపోయాడు. పొలంలో అమర్చిన నిఘా కెమెరాలో చిరుతపులి కదలికలు రికార్డయ్యాయి. దీంతో షాక్‌కు గురైన అతను విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసి పొలం వద్దకు వెళ్లి చిరుతపులి కనిపించింది. పొలంలో ఉన్న మేకలు, పిల్లలు, గేదెలపై మాత్రం చిరుత దాడి చేయలేదు. చిరుతపులి సంచరించడంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది బోనును కూడా ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్క అప్రమత్తం కావడంతో చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. #leopard #dog మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి