Elections: సిరా గుర్తు తెచ్చిన చిక్కు..తొమ్మిదేళ్లు అయినా చెరగని ఇంక్‌ మార్క్‌!

సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్టిన ఇంకు మార్క్ కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది.తర్వాత నెమ్మదిగా పోతూ ఉంటుంది. కొంత మందికి మహా అయితే.. రెండు, మూడు నెలలు టైం పట్టచ్చు.కానీ ఓ మహిళకు మాత్రం ఏకంగా 9 సంవత్సరాలు ఉంది.. ఈ కథ గురించి తెలుసుకోవాలంటే..ఈ కథనంలో చదివేయండి..

New Update
Elections : నేడు దేశంలో ఐదో దశ పోలింగ్‌.. ఈ సారి కూడా పోటీలో ప్రముఖులు!

మరి కొన్ని గంటల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్లు సొంత ఊళ్లకు ప్రయాణం అయ్యారు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత చేతికి సిరా గుర్తు పెడతారనే విషయం అందరికీ తెలిసిందే. ఇది మన చేతిపై ఉన్నాదంటే మనం ఓటు వినియోగించుకున్నట్లే. ఎవరైనా రెండో సారి దొంగ ఓటు వేసేందుకు వీలు లేకుండా ఇది సింబల్ అన్నమాట.

ఇప్పుడు ఇలాంటి సిరానే ఓ మహిళకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. అసలు ఏం జరిగిందంటే..సాధారణంగా ఇంకుతో వేలుపై పెట్టిన మార్క్ కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత నెమ్మది నెమ్మదిగా పోతూ ఉంటుంది. కొంత మందికి మహా అయితే.. రెండు, మూడు నెలలు టైం పట్టచ్చు. కానీ ఓ మహిళకు మాత్రం తాను ఓటు వేసినప్పుడు వేలుకు సిరాను పెట్టారు. దాదాపు అది పెట్టి 9 ఏళ్లు అవుతుంది. కానీ అది ఇంకా పోకపోవడం విశేషం.

కేరళకు చెందిన ఉష (62) 2016లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన సిరా గుర్తు మాత్రం చెరిగిపోకుండా ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయింది.దానిని తొలగించుకునేందుకు ఆమె అనేక ప్రయత్నాలు చేసింది. అయినా ఉపయోగం లేదు. దీంతో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఆ ఇంకు గుర్తు కారణంగా ఓటేసేందుకే వెళ్లలేదు.

దాదాపు తొమ్మిదేళ్లయినా తన ఎడమచేతి చూపుడు వేలికి వేసిన సిరా గుర్తు ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇక 2024 లో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తడంతో.. ప్రచారానికి వచ్చిన నాయకుడికి తన సమస్యను వివరించింది. దీంతో ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు.

Also read: ఓటు వేశారా..అయితే మాకు ఫొటో పంపండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు