/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ax.jpg)
Kurnool : తాగిన మత్తులో కట్టుకున్న భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ కసాయి మొగుడు (Husband Killed His Wife). ఈ దారుణమైన ఘటన నంద్యాల జిల్లా (Nandyala District) కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్య సుగుణమ్మ (48) ను భర్త వడ్డే రమణ కిరాతకంగా గొడ్డలితో హత్య (Murder) చేశాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. వడ్డే రమణ చాలా కాలంగా తాగుడు బానిసయ్యాడు.
Also Read: పీక్ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.!
ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. గత రాత్రి కూడా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపం పెంచుకున్న భర్త రమణ నిద్రిస్తున్న భార్య సుగుణమ్మను తెల్లవారు జామున గొడ్డలితో నరికి హత్య చేశాడు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు నిందితుడు రమణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.