పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. పెళ్లి అనేది బంధాలను బలపరచడమే కాదు మ్యారీడ్ కపుల్స్ హెల్త్‌ను కూడా ఇంపాక్ట్ చేస్తుందంటున్నారు నిపుణులు. రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు గుండె జబ్బుల నుంచి లైంగిక సంక్రమణ వ్యాధుల ఒత్తిడి నుంచి మంచి రిజల్ట్స్‌ను అందిస్తుంది. క్యాన్సర్, గాయాల నుంచి త్వరగా రికవరీ చేస్తుంది. By srinivas 13 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి భారతీయ సమాజంలో ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. కాగా ఈ మ్యారేజ్ రూల్స్ వివిధ మతాల సంస్కృతుల ప్రకారం మారుతుంటాయి. కానీ ప్రధానంగా ఇది వ్యక్తుల మధ్య సంబంధాలలో సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. రెండు మనసులను ముడివేసే ఈ బంధం ఎన్నో కుంటుంబాలను దగ్గర చేస్తుంది. మరో తరానికి అంకురార్పణ చేస్తుంది. అయితే పెళ్లి అనేది బంధాలను బలపరచడమే కాదు మ్యారీడ్ కపుల్స్ హెల్త్‌ను కూడా ఇంపాక్ట్ చేస్తుందంటున్నారు నిపుణులు. ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించిన ప్రకారం పెళ్లి అనేది రోగ నిరోధక శక్తి పెంచడంతోపాటు అనేక మెంటల్ హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉంచుతుంది. గుండె జబ్బుల నుంచి లైంగిక సంక్రమణ వ్యాధుల వరక ఒత్తిడి నుంచి ఓర్పు వరకు అన్నింటిలోనూ మంచి రిజల్ట్స్‌ను అందిస్తుంది. సహనం, సానుభూతిని పెంచడంతోపాటు మెంటల్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. కార్డియోవాస్క్యులర్ డిసీజ్, డయాబెటిస్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. క్యాన్సర్, గాయాల నుంచి త్వరగా రికవరీ చేస్తుంది. నిజంగా బ్యాచిలర్స్‌తో పోలిస్తే పెళ్లైన వారికి రెండు రెట్లకు మించిన ఫలితాలను ఇస్తుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. జీవిత భాగస్వాములు ఎల్లప్పుడూ ఒకరి మనోభావాలతో మరొకరు ప్రభావితం అవుతారు. కాబట్టి మీరు కోపంగా లేదా సంతోషంగా భాధలో ఉన్నట్లయితే మీ లైఫ్ పార్ట్‌నర్ కూడా అలాగే భావిస్తారు. ఒక అధ్యయనం ప్రకారం భార్యల్లోనే ఎమోషన్ క్యారీయింగ్ మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. భర్తల బాధలను భార్యలు కూడా దాదాపు సరిసమానంగా అనుభవిస్తున్నట్లు వెల్లడించారు. అయితే సింగిల్స్ ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగార సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే లైంగిక సంక్రమణ వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఇక సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్(STD) బారిన పడకుండా బ్రహ్మచర్యంతోపాటు పెళ్లి కూడా ఇందుకు సహాయపడుతుంది. పెళ్లి అయినవారు కేవలం భార్య/భర్తతో మాత్రమే సన్నిహితంగా ఉంటారు కాబట్టి STD సంక్రమణ తగ్గుతుంది. ఇటీవల 17 దేశాల్లో జరిగిన అధ్యయనం ప్రకారం.. పెళ్లితో ముడిపడిన బంధం మెంటల్ హెల్త్‌ను గతంలోకంటే మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. పెయిర్-బాండింగ్ పాజిటివ్ ఎఫెక్ట్ కారణంగా ఒంటరితనం, ఒత్తిడి, డిప్రెషన్ దూరం అవుతుంది. ముఖ్యంగా పెళ్లి అనే బంధాన్ని బాధ్యతగా తీసుకుంటున్న కపుల్స్ సూసైడ్ ఆలోచనలకు దూరంగా ఉంటున్నట్లు రిసెర్చ్‌లో తేలినట్లు పేర్కొన్నారు. Also read :Big Breaking: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 7గురు మృతి మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు మ్యారేజ్ చేసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు నిపుణులు. హ్యాపీ మ్యారేజ్ దీర్ఘకాలిక ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది కాబట్టి బలమైన రోగనిరోధక వ్యవస్థకు కారణమవుతుంది. మరోవైపు అన్‌హ్యాపీ మ్యారేజ్ అపోజిట్ రిజల్ట్ చూపుతుంది. 2018 స్టడీ ప్రకారం ట్రబుల్డ్ మ్యారేజ్ సైకలాజికల్, బయోలాజికల్ ఎఫెక్ట్స్ చూపుతుంది. డిప్రెషన్ ఇమ్యూన్ సిస్టమ్‌ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఇక 2014 అధ్యయనం ప్రకారం.. సాధారణంగా యువకులకు పెళ్లికి ముందు ఉండే మద్యం, ధూమపానం అలవాట్లు పెళ్లి తర్వాత అటోమెటిక్‌గా తగ్గిపోతాయని తెలిపారు. భాగస్వామినీ ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక చాలామంది ఈ అలవాట్లను వదులుకున్నుట్లు వెల్లడించారు. ఖచ్చితంగా వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం, కాలుష్య కారకాలను నివారించడం వంటివి మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కానీ వివాహం చేసుకోవడం కూడా ఇందుకు సహాయపడుతుందని తేలింది. పెళ్లికాని సహచరులతో పోల్చితే పెళ్లి చేసుకున్న వారిలోనే చనిపోయే అవకాశం రెండు రెట్లు తక్కువగా ఉంటుంది. వివాహ బంధంలో ఉన్నవారే ఎక్కువ కాలం జీవిస్తారు. ఇది పురుషులకు ప్రత్యేకించి వర్తిస్తుంది. స్త్రీల విషయానికొస్తే పెళ్లి కొన్నిసార్లు అనారోగ్యాలకు దారితీస్తుంది. తమ భర్తల కంటే ఏడు నుండి తొమ్మిదేళ్లు పెద్ద వయస్సు ఉన్న స్త్రీలు అదే వయస్సులో ఉన్నవారి కంటే 20% ఎక్కువ మరణాల రేటును కలిగి ఉన్నట్లు తెలిపారు. అలాగే పెళ్లికాని వారితో పోలిస్తే పెళ్లయిన వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువ. ప్రధానంగా తీసుకునే ఆహారాన్ని స్త్రీ జాగ్రత్తగా ఎంచుకుంటుంది. కాబట్టి డయాబెటిస్ ఎఫెక్ట్ ఉండదని వెల్లడైనట్లు తెలిపారు. 2018లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. మన భాగస్వామినీ శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ బాగా చూసుకుంటాం. ఆరోగ్య సంక్షోభంలో సరైన మద్దతు ఇస్తాం. క్యాన్సర్ ముందస్తు రోగనిర్ధారణ జరిగితే భాగస్వామి కేర్‌ఫుల్‌గా చూసుకోవడం జరుగుతుంది. భార్య/భర్తను బతికించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తారని అధ్యయనం కనుగొంది. హ్యాపీ మ్యారేజ్‌లో గాయాలు కూడా త్వరగా హీల్ అవుతాయని తెలిపింది. ముఖ్యంగా పెళ్లైన వారితో పోల్చినప్పుడు అవివాహితులు హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం 42% ఎక్కువని కనుగొంది. తక్కువ కార్టిసాల్ స్థాయిలు, అధిక ఆక్సిటోసిన్ స్థాయిలతో పాటు వివాహితులు పెళ్లికాని వ్యక్తులతో పోల్చినప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఎక్కువ పని చేయడం, తక్కువ రిస్క్‌లు తీసుకోవడం వంటివి చేస్తారు. హృదయ సంబంధ వ్యాధుల నివారణలో ఇవన్నీ కీలకమైనవి పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. #increase #life-expectancy #health-advantages #of-marriage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి