Kamala Harris: టీచర్‌తో వివాహేతర సంబంధం నిజమే.. కమల్ హారిస్ భర్త! మొదటి వివాహ బంధంలో ఓ లేడీ టీచర్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని కమల్ హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ అంగీకరించాడు. తన చర్యలతో కుటుంబం చాలా ఇబ్బందిపడిందన్నారు. అదే తన మొదటి వివాహానికి ముగింపు పలికిందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. By srinivas 04 Aug 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Douglas Emhoff: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి సంచలన నిజం బయటపెట్టారు. గతంలో తనకు ఓ లేడీ టీచర్ వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించారు. మొదటి వివాహం సమయంలో ఈ సంబంధం కలిగి ఉన్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో తను మొదటి భార్యను తాను మోస చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇది కూడా చదవండి: Ram Pothineni: దుమ్మురేపుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్.. రామ్ చిచ్చ రచ్చ రచ్చ! ఈ మేరకు డగ్లస్ మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ మ్యారేజ్ తర్వాత నా చర్యలతో నేను, కెరిస్టిన్ కఠిన సమయాన్ని ఎదుర్కొన్నాం. దీనికి నేను పూర్తి బాధ్యత వహించాను. నా పిల్లలు చదివే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలితోనే వివాహేతర సంబంధం కలిగి ఉన్నాను. ఈ విషయమే నా మొదటి వివాహానికి ముగింపు పలికింది’ అని చెప్పారు. ఇక కమలా హారిస్, హెమ్‌హోఫ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. కమలా హారిస్‌కు ఇది మొదటి వివాహం కాగా.. హెమ్‌హోఫ్‌కు రెండోది. ఇదిలా ఉంటే.. అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైన విషయం తెలిసిందే. #kamala-haris #america #douglas-emhoff సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి