KTR : కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశం!

కేటీఆర్‌పై ఎలక్షన్ కమీషన్ చర్యలకు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగిన పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది. తాను ఎవరికి ఓటు వేశారో పరోక్షంగా బయటపెట్టడం నేరంగా పేర్కొంది.

New Update
KTR : కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశం!

Election Commission : బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR) పై ఎలక్షన్ కమీషన్ చర్యలకు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా మే 13న జరిగిన పోలింగ్ (Polling) నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది. పోలింగ్ రోజున కేటీఆర్ మాట్లాడుతూ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా బయటపెట్టాడు. దీనిని ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొన్న ఈసీ కేటీఆర్ పై చర్యలకు ఆదేశిస్తూ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు కాల పరిమితి విధించింది. అయతే గడువు ముగిసినా కేటీఆర్ వివరణ ఇవ్వకపోవడంతో చర్యలకు ఆదేశించినట్లు పేర్కొంది.

ఇదిలావుంటే.. ఆదివారం ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్.. రెండు కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. క్షేత్రస్థాయి వరకు తాము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని, కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన తప్పు అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీ విషయంలో రోజుకో మాట మారుస్తోందన్నారు. తాము ఇచ్చిన ఉద్యోగాలకు వారు నియామకపత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటే అంటూ విమర్శలు చేశారు.

Also Read : ఇరాన్ అధ్యక్షుడే కాదు మన వైఎస్ సహా చాలామంది ఇలానే.. హెలికాప్టర్ ప్రమాదాల తీరిదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు