GOAT Movie : దళపతి విజయ్ 'ది గోట్' రన్ టైం అన్ని గంటలా? దళపతి విజయ్ 'ది గోట్' మూవీ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. By Anil Kumar 28 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి The GOAT Movie : వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సెప్టెంబర్ 5 న ఈ మూవీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. డైరెక్టర్ వెంకట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఇక సినిమా ఫైనల్ రన్‌టైమ్ 3.03 నిమిషాలుగా ఉంది. ఇంత ఎక్కువ రన్ టైంతో ఆడియన్స్ ను థియేటర్స్ లో కూర్చోబెట్టాలంటే సినిమాలో కంటెంట్ ఉండాలి. లేకపోతే కష్టమే అని విశ్లేషకులు చెబుతున్నారు. And it’s a U/A for #TheGreatestOfAllTime pic.twitter.com/TG8y3Retxy — venkat prabhu (@vp_offl) August 21, 2024 Also Read : శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ మరి తన రీసెంట్ మూవీ 'కస్టడీ' తో డిజాస్టర్ అందుకున్న వెంకట్ ప్రభు.. 'గోట్' తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. . ఏజీఎస్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, కిచ్చా సుదీప్, లైలా, మీనాక్షీ చౌదరి, స్నేహ, యోగిబాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. #TheGoat bookmyshow 136k interested 🎟️❤️🔥❤️🔥❤️🔥 Duration: 3hrs 3mins 14secs. Certified: U/A In theaters from September 5th!#TheGreatestOfAllTime @actorvijay @vp_offl @thisisysr @archanakalpathi @aishkalpathi @Ags_production pic.twitter.com/dQcNMGFp46 — The GOAT Movie (@GoatMovie2024) August 27, 2024 #thalapathy-vijay #the-goat-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి