TGPSC Group-2, 3: గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా?: క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ!

తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఓ ఫేక్ ప్రకటన కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ విషయంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రియాక్ట్ అయ్యింది. ఇదంతా ఫేక్ అని ప్రకటించింది.

New Update
TG News: తెలంగాణలో ఆ రెండు పరీక్షలు రద్దు!

తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు టీజీపీఎస్సీ పేరిట ఓ ఫేక్ ప్రకటన కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఈ విషయంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రియాక్ట్ అయ్యింది. ఇదంతా ఫేక్ అని ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై విద్యాశాఖ, టీజీపీఎస్సీ చర్చించి నిర్ణయం తీసుకుంటాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పరీక్ష వాయిదా పడడం పక్కా అంతా భావించారు.

అయితే.. నిన్న సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, బీఆర్ఎస్ పార్టీ పరీక్షలను వాయిదా వేయించాలని కుట్రలు చేస్తున్నాయంటూ ప్రకటించారు. దీంతో పరీక్షలు వాయిదా పడడం జరగదన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పరీక్షల వాయిదాపై తీవ్రంగా చర్చ జరుగుతున్న వేళ.. ఇదే అదనుగా ఫేక్ గాళ్లు తమ క్రియేటివిటీకి పని చేప్పారు. టీజీపీఎస్సీ లోగోతో ఓ ఫేక్ ప్రకటనను రూపొందించి సోషల్ మీడియాలోకి వదిలారు.

ఇది నిజమనుకున్న అనేక మంది నిరుద్యోగులు ఆ ప్రకటనను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కొన్ని టీవీ ఛానళ్లు సైతం చెక్ చేసుకోకుండా పరీక్షలు వాయిదా అంటూ బ్రేకింగ్ లు ఇచ్చేశాయి. అయితే.. టీజీపీఎస్సీ వెబ్ సైట్లో మాత్రం ఈ ప్రకటన ఎక్కడా కనిపించలేదు. దీంతో నిరుద్యోగుల్లో ఇది నిజమా? కాదా? అన్న ఉత్కంఠ వ్యక్తమైంది. విషయం టీజీపీఎస్సీ దృష్టికి సైతం వెళ్లింది. దీంతో కమిషన్ వెంటనే స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో టీజీపీఎస్సీ లోగోతో సర్క్యులేట్ అవుతున్న వెబ్ నోట్ ఫేక్ అని ప్రకటించింది. దీంతో పరీక్షలు వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు