TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

లంగాణలో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్‌ సైట్‌ లో మాస్టర్‌ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు

New Update
TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!

TGPSC Group-1 : తెలంగాణ (Telangana) లో గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ పరీక్ష (Group-1 Prelims Exam) కు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ (TGPSC) తాజాగా విడుదల చేసింది. వెబ్‌ సైట్‌ లో మాస్టర్‌ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు. ఆన్సర్ కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా జూన్ 17 వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు.

ప్రాథ‌మిక కీపై అభ్యంత‌రాల‌ను 13వ తేదీ నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంట‌ల లోపు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకుని రావొచ్చని అధికారులు తెలిపారు. దీనికోసం మొదట కమిషన్ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా వ్యక్తిగత వివరాలను ధృవీకరించాలి. ఆ తర్వాత అభ్యంత‌రాల‌ను ఇంగ్లీష్‌ లో ఎంటర్ చేయాలి. ఈ-మెయిల్, వ్యక్తిగత అభ్యర్థనలు, ఇతర పద్ధతుల్లో వచ్చే, గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంత‌రాల‌ను పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ వివరించారు.

మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరందరికీ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. అయితే వీరిలో 3.02 లక్షల (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్ష మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇక కమిషన్ బుధవారం మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.

Also read: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Inter Results: నేడే తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌ ఫోన్‌లో కూడా రానున్నాయి.  

New Update
Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. రిజల్ట్స్ వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పాటు మొబైల్‌ ఫోన్‌కు కూడా రిజల్ట్స్ లింక్ పంపనున్నారు. ఆ లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేస్తే రిజల్ట్స్ ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

 

 

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment