Telangana : రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే.. వర్షాలు!

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.

New Update
Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

Rain Alert : తెలంగాణ (Telangana) లో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లోకి వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

బుధవారం ఉదయం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ,ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం,ఆదిలాబాద్‌, , ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

బుధవారం నుంచి గురువారం వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి ,నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, జిల్లాలో వర్షాలు పడుతాయని ఐఎండీ (IMD) వివరించింది.

ఇక గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.

Also read: తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

Advertisment
Advertisment
తాజా కథనాలు