Telangana: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌!

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేసింది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Telangana: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేసింది. గురువారం ఉదయం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి.

ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో భారీ వర్షాలు పడే అవకాశాలున్న జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ తో పాటు... పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నందున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also read: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్

Advertisment
Advertisment
తాజా కథనాలు