NRSC Jobs: పది, ఐటీఐ అర్హతతో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలు..జీతం రూ. 60వేల పైనే..!!

పది, ఐటీఐ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఇస్రోకి చెందిన NRSCలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 54టెక్నీషియన్ పోస్టులకు ఆన్ లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు.

New Update
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

ISRO NRSC Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో మొత్తం 54 టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కొలువుల కోసం https://www.nrsc.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు:
మొత్తం పోస్టులు: 54
టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్, మెకానిక్‌): 33 పోస్టులు
ఎలక్ట్రికల్‌: 8 పోస్టులు
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 9 పోస్టులు
ఫొటోగ్రఫీ, డీటీపీ ఆపరేటర్‌ : 2 పోస్టులు
విద్యార్హత:
అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం:
లెవెల్‌ -3 పే కింద నెలకు రూ.21,700- రూ.69,100 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తులు:
డిసెంబర్‌ 31 సాయంత్రం 5గంటల వరకు చేయవచ్చు. ఈ ఉద్యోగాలు తాత్కాలికమైనవే.. కానీ కొనసాగించే అవకాశాలు ఉంటాయి.

వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు డిసెంబర్‌ 31 నాటికి 18 నుంచి 35సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/BC/OBCలకు 3ఏళ్ల చొప్పున వయో పరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
రూ.100. అయితే, ప్రాసెసింగ్‌ ఫీజు కింద మరో రూ.500లు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు.

ఎంపిక విధానం:

రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 80 ప్రశ్నలు అడుగుతారు. 1.50గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానం రాస్తే 0.33 మార్కులు కోత విధిస్తారు. స్కిల్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో తుది జాబితా ఆధారంగా స్కిల్‌ టెస్ట్‌కు సెలక్ట్ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే:
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌, కరీంనగర్‌.

Notification PDF

ఇది కూడా చదవండి: ఏపీలోని పేదలకు శుభవార్త.. ఆ స్కీం బెనిఫిట్స్ రూ.25 లక్షల వరకు పెంపు.. నేడు ప్రారంభించనున్న సీఎం జగన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు