నాసాలో ఉద్యోగం సాధించిన తెలుగు యువకుడు

పేద కుటుంబంలో పుట్టినా ఇంట్లో పరిస్థితులు సహకరించకున్నా విదేశాల్లోని గొప్ప కంపెనీల్లో ఉద్యోగం సాధించిన విద్యార్థుల జీవితం అందరికీ స్ఫూర్తినిస్థాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువకుడి విజయ గాధను ఇప్పుడు చూద్ధాం

New Update
నాసాలో ఉద్యోగం సాధించిన తెలుగు యువకుడు

చాలా మంది భారతీయులు ఆగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు. అందుకోసం తమ శక్తికి మించి చదివిస్తుంటారు. కానీ తెలుగు కుర్రాడు అమెరికాలో ఉద్యోగం సాధించాడు. అది కూడా అమెరికా అంతరిక్ష పరిశోధక కేంద్రమైన నాసాలో కావడం విశేషం. ఆ కుర్రాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి కుటుంబం కూలి పని చేస్తే కాని పూట గడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పెట్టిన ఈ కుర్రాడు అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నాడు. తనకంటూ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్న కుర్రాడు.. తన టార్గెట్‌ను రీచ్‌ అయ్యేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లాడు. నాసాలో ఉద్యోగం సాధించడంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.

హర్షవర్థన్‌ రెడ్డి స్వస్థలం కడప. కాగా 30 సంవత్సరాల క్రితంఅతని తల్లిదండ్రులు ఈశ్వర్‌ రెడ్డి, పార్వతి గుంటూరుకు వలసొచ్చి అక్కడే స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు కాగా అందులో హర్షవర్థన్‌ రెడ్డి పెద్దోడు. హర్షవర్థన్‌ రెడ్డి కడపలోని పులివెందులలో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. తర్వాత జేఈఈ ఎంట్రెన్స్‌ పరీక్ష రాసి ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. అతను చదవుల్లో ప్రతిభ కనబర్చి గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చినందుకు హర్షవర్థన్ రెడ్డికి ఓఎన్టీసీ 1 లక్ష రూపాయల ఉపకార వేతనం అందించింది.

హర్షవర్ధన్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ అనంతరం పీహెచ్‌డీ చేయాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు బాగోలేకపోవడంతో చదవుకు అక్కడితో ఫుల్‌స్టాప్ పలికాడు. అనంతరం పని చేస్తూ విద్యనభ్యసించాలని నిర్ణయం తీసుకున్న హర్షవర్ధన్‌.. ఆ దిశగా అడుగులు వేశాడు. ఇందులో భాగంగా కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేరాడు. ఏరో స్పేస్‌లో పీహెచ్‌డీ చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేశాడు. నాసాలో అంతలోనే నాసాలో ఉద్యోగం లభించింది. దీంతో తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో హర్షవర్థన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు