nellur: చంద్రబాబు జైల్ నుంచి విడుదల అవ్వాలని యాగం చంద్రబాబును సీఐడీ అక్రమ అరెస్టు చేయడంపై ప్రజాసంఘాలు, చంద్రబాబు అభిమాన సంఘాలు, టీడీపీ శ్రేణులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులందరూ ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఆయనను వెంటనే రాజమహేంద్రవరం జైల్ నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే రోజుకు రోజుకు మారుతున్న ప్రరిణామాల నేపథ్యంలో నేడు విమోచన యాగం చేశారు. By Vijaya Nimma 22 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జైల్ నుంచి విడుదల అవ్వాలని నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 10వ రోజు బంధ విమోచన యాగం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం చంద్రబాబు నాయుడుకి ఎదురవుతున్న ప్రతిబంధకాలు తొలగాలని, రాజకీయ కుట్రలను తిప్పికొట్టే విధంగా ఆ భగవంతుడు నారా చంద్రబాబు నాయుడుకి మరియు నారా లోకేష్‌కి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో ప్రపంచలో ఉండే తెలుగువారంతా చంద్రబాబు నాయుడు కోసం చేస్తున్న పోరాటాలు, పూజలు ఫలించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఆ భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కస్టడీకి అనుమతి చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలసిందే. ఆయనను కస్టడీకి అనుమతిస్తున్నట్లు ఏసీబీ కోర్టు ప్రకటించింది. చంద్రబాబును సీఐడీ ఐదు రోజుల కస్టడీకి కోరింది. కానీ ఏసీబీ కోర్టు రెండు రోజుల మాత్రతే కస్టడీకి అనుమతి ఇచ్చింది. చంద్రబాబును జైలులోనే విచారించేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు పేర్కోంది. నేడు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే విచారణ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచరణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతించాలని స్పష్టం చేసింది. పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తడకపల్లి సుధా రవీంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, కనపర్తి గంగాధర్, గుండాల మధుసూదన్‌రెడ్డి, వనజారెడ్డి, హజరత్ నాయుడు, షంషుద్దీన్, సాబీర్‌ఖాన్, చెక్కసాయి సునీల్, బూడిద పురుషోత్తం యాదవ్, ఒట్టూరు సురేంద్ర యాదవ్, వడ్లమూడి రమేష్ చౌదరి, పఠాన్ జాఫర్‌ఖాన్, సీ.హెచ్. లక్ష్మిరెడ్డి, దాట్ల చక్రవర్ధన్‌రెడ్డి, నుత్తు సింహాచలం, రంగయ్య, మునీర్, అంకోష్ నాయుడు, కాపా భాస్కర్ నాయుడు, రూపక పరదేశి,పద్మ, తదితరులు పాల్గొన్నారు. #jail #rural-mla-kotamreddy-sridhar-reddy #tdp-leaders-kotamreddy-giridhar-reddy #yagam #release-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి