Ram Charan: ఆ నిర్మాతకు ధైర్యం చెప్పిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..!! దిల్ రాజును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరామర్శించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజును సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తు.. ధైర్యం చెబుతున్నారు. By Jyoshna Sappogula 10 Oct 2023 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Ram Charan: తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దాంతో దిల్ రాజు సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. తండ్రి మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న దిల్ రాజుకు పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పి ఓదార్చారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. సోమవారం రాత్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైకి తరలించారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు దిల్ రాజు తండ్రి. అక్టోబర్ 9వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మరణించారు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ రోజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిల్ రాజును పరామర్శిస్తున్నారు. దిల్ రాజు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాం సుందర్ రెడ్డికి నివాళులు అర్పించారు. దిల్ రాజు తండ్రి అంత్యక్రియల్లో నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌ను చూడగానే దిల్ రాజు బోరున విలపించేశారు. అంత్యక్రియల్లో పలువురు ప్రముఖులు పాల్గొని సంతాపం తెలుపగ..మరికొందరు సోషల్ మీడియా అనుసంధాన వేదికగా సంతాపం తెలిపారు. Also Read: నా మీద నాకే సిగ్గుగా అనిపించింది..!! #tollywood #ramcharan #dilraju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి