House arrests: అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. By Vijaya Nimma 11 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పలు చోట్ల బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. బంద్‌కు పిలుపు అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్టులు చేశారు. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల వలయాన్ని తప్పించుకొని బయటకు నేతలు వస్తున్నారు. రోడ్డు మీదకు వస్తున్న నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు పోలీసులు. వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీతను ఉదయం నాలుగు గంటలకే హౌస్ అరెస్ట్ అయ్యారు. పోలీసుల వలయాన్ని తప్పించుకొని బయటికి వచ్చి.. కార్యకర్తలతో కలిసి వెంకటాపురం నుంచి ర్యాలీగా వెళ్లున్న పరిటాల సునీత. కదిరి ఆర్టీసీ డిపో వద్ద కందికుంట ప్రసాద్ ఆందోళనకు దిగిన్నారు. కళ్యాణదుర్గంలో ఆర్టీసీ డిపో వద్ద ఉమామహేశ్వర నాయుడు నిరసన చేపట్టారు. బస్సులు బయటికి రాకూడదంటూ ఆందోళనలు చేస్తున్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌ను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. టీడీపీ నేతల అరెస్ట్ కడప జిల్లాలో బంద్‌ను భగ్నం చేశారు పోలీసులు. రోడ్డుపైకి వచ్చి బైఠాయించి వాహనాలను నిలుపదల చేసినందుకు టీడీపీ నేతల అరెస్ట్ అయ్యారు. కోటిరెడ్డి కూడలిలో టీడీపీ రాష్ట్ర నేతలు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డిల అరెస్ట్ చేశారు. పలువురు నేతలు గృహ నిర్భందాలు చేస్తున్నారు. మైదుకూరు, కడప, కమలాపురంలో టీడీపీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్, శ్రీనివాసుల రెడ్డి, పుత్తా నర్సింహారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మొహరించారు. బద్వేల్, మైదుకూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది. అనంతరం యథావిధిగా బస్సు రాకపోకలు సాగిన్నాయి. #chandrababu #tdp-leaders #kadapa-district #anantapur #house-arrests #bandh-in-many-places #protest-the-arrest మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి