Santhi Swaroop: మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

దూరదర్శన్ తెలుగు వార్తలు అనగానే మనకు గుర్తుకువచ్చే వ్యక్తి శాంతిస్వరూప్. తెలుగు మొట్టమొదటి న్యూస్ రీడర్ ఈరోజు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మలక్ పేట యశోదా ఆస్పత్రిలో శాంతిస్వరూప్ భౌతికకాయం ఉంది.

New Update
Santhi Swaroop:  మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

 Telugu first News Reader:తెలుగు వార్తలు అనగానే మొట్టమొదట గుర్తుకువచ్చే పేరు శాంతి స్వరూప్. దూరదర్శన్‌లో ఆయన వార్తలు చదవడం ఇప్పటికీ చాలా మందికి నొస్టాలిజీ. తెలుగులో మొట్టమొదట యాంకర్‌గా గుర్తింపు పొందిన శాంతిస్వరూప్ ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు మరణించారు.

మొట్టమొదటి తెలుగు యాంకర్..

తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్. ఇప్పుడన్న ఛానెల్స్ అప్పుడు లేవు, ఇప్పున్నంత మంది యాంకర్లుకూడా అప్పుడు లేరు. ముఖ్యంగా చాలా కాలం పాటూ తెలుగుకు ఒక మేల్ యాంకర్, ఒక ఫిమేల్ యాంకర్ మాత్రమే ఉండేవారు. అలాంటి టైమ్‌లో శాంతి స్వరూప్ తెలుగు న్యూస్‌కు చుక్కానిలా పని చేశారు. ఈయన రాత్రి తొమ్మది గంటల న్యూస్ ఎప్పుడు చదువుతారా అని ఎదురు చూసేవారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శన్ చానెల్‌లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చ‌దివారు. ప‌దేండ్ల పాటు టెలీప్రాంప్ట‌ర్ లేకుండా పేప‌ర్ చూసి వార్త‌లు ప్ర‌జ‌ల‌కు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని ముద్ర వేశారు. 2011 వరకు శాంతి స్వరూప్ వార్తలు చదువుతూనే ఉన్నారు.

1983లో మొదటి సారి వార్తలు..

1980లో యాంకర్‌ రోజారాణితో శాంతి స్వరూప్‌కు వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. 1983 నవంబర్‌ 14న సాయంత్రం 7 గంటలకు ఫస్ట్‌ బులెటిన్‌... అప్పట్లో ఒక సంచలనం అయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా శాంతి స్వరూప్ లైవ్‌లో న్యూస్‌ చదివారు. 1978లోనే ఆయన ఉద్యోగంలో చేరినా వార్తలు చదివింది మాత్రం 1983లో. అప్పట్లో టెలీ ప్రాంప్టర్‌ కూడా ఉండేది కాదు. స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి వార్తలు చెప్పేవారు శాంతిస్వరూప్‌. టీవీల్లోకి రాక ముందు ఈయన కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు.

విలక్షణ శైలి...

శాంతి స్వరూప్‌ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎలాంటి కార్యక్రమమైనా ఏకధాటిగా నడపగల దిట్ట.రామంతాపూర్‌లోని టీవీ కాలనీలో ఆయన నివాసం. 20ఏళ్లకు పైగా తెలుగు వార్తలు చదివిన ఏకైక వ్యక్తిగా శాంతి స్వరూప్ ఘనత వహించారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. ఎలాంటి వార్త అయినా ఒకేలా చదవడం ఆయన ప్రత్యేకత.

Also Read:Rashmika Birthday : వాణిజ్య ప్రకటనల నుంచి నేషనల్‌ క్రష్‌గా …!

Advertisment
Advertisment
తాజా కథనాలు