Murali Mohan: త్వరలోనే చంద్రబాబు బయటకు.. మురళి మోహన్ సంచలన ప్రకటన

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో పాటు నారా కుటుంబం వివిధ కార్యక్రమాలు చేస్తూ నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా జైల్‌లో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్, రాజమండ్రిలో భువనేశ్వరి ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మురళీ మోహన్ చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబుదేనని అన్నారు.

New Update
Murali Mohan: త్వరలోనే చంద్రబాబు బయటకు.. మురళి మోహన్ సంచలన ప్రకటన

భాగ్యనగర్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ఈ రోజు మురళి మోహన్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై సంచనల వ్యాఖ్యాలు చేశారు. "నేను అమెరికా దాటి ఎక్కడ ఆఫీస్‌ పెట్టలేదు. ఒకవేళ ఇండియాకి వస్తే మొదటిసారి మీ దగ్గరికి వచ్చి ఆఫీస్‌ పెడతానని" ఆనాడు బిల్ గేట్స్‌తో చంద్రబాబు అన్నారన్నారు. హైదరాబాద్‌కి ఐటీ రంగాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మైక్రోసాఫ్ట్ రాగానే ఒకరితో ఒకరు అందరూ లైన్ కట్టి హైదరాబాద్ వచ్చారని మురళి మోహన్ వివరించారు. బిల్ గేట్స్‌ని హైదరాబాద్ హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి చంద్రబాబు పిలిచారు. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు, హైటెక్ సిటీ పెరుగుతుంటే దానికి కావాల్సిన వసతులన్నీ ముందుగానే ఊహించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

అన్యాయంగా జైల్లో పెట్టారు

20-20లో ఎలాగో చేయలేకపోయారు దురదృష్టవశాత్తు కానీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉన్నా 40 వరకు తప్పకుండా చేస్తారని నేను నమ్ముతున్నాను సీనియర్ నటుడు మురళి మోహన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మున్నే ఢిల్లీ పార్లమెంట్ దగ్గర దీని గురించి చర్చించామన్నారు. ఆయన తొందరగా బయటికి రావాలని.. దాంతోపాటు రాజ్ ఘాట్ కు వెళ్లి అక్కడ ఒక అరగంట వేడుకున్నామన్నారు. ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్‌లో ఇప్పుడు సుహాసిని నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నానన్నారు. 74 సంవత్సరాలు ఉన్న ఒక మంచి ముఖ్యమంత్రిని ఈరోజు జైల్లో పెట్టడం అనేది అన్యాయమని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.

అద్భుతంగా అభివృద్ధి చేస్తారు...

వెంటనే ఆయన విడుదల కావాలని సీనియర్ నటుడు మురళీ మోహన్ డిమాండ్‌ చేశారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాలన్నారు. అరచేయితో సూర్యుని ఆపలేము గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నానని సీనియర్ నటుడు మురళి మోహన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నగరం ఇవన్నీ కూడా అద్భుతంగా  అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతున్నానని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.

జైల్‌లో కనీస వసతులు లేవు

రాజమహేంద్రవరం జైల్‌ నుంచి గ్రహణం వీడి త్వరలో చంద్రబాబు బయటకు వస్తారని మురళీ మోహన్‌ దీమా వ్యక్తం చేశారు. ఏం నేరం చేశారని చంద్రబాబును జైల్లో పెట్టారు.? అని ఆయన ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఎంతో శ్రమించి, ఐటీ పరిశ్రమలు స్థాపించారు. జైల్‌లో కనీస వసతులు లేకుండా చంద్రబాబును ఖైదీల మధ్య ఉంచడం బాధాకరమన్నారు. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని కలిసి మురళీ మోహన్‌ మద్దతు తెలిపారు. ఏది మంచి.. ఏది చెడు అనేది ఏపీ ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఆ ప్రభావం తప్పకుండా వచ్చే ఎన్నికలపై ఉంటుందని జోస్యం చెప్పారు. మన నాయకుడు ఎంత ధైర్యంగా ఉన్నారో.. మనం కూడా అంతే ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సీనియర్‌ సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు