Bigg Boss 7 Telugu : గేమ్ మొత్తం చేంజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!

ఇప్పటి వరకు జరిగిన ‘బిగ్‌ బాస్‌ ' సీజన్స్ వేరు.. ఇప్పుడు జరుగుతున్న ‘బిగ్‌ బాస్‌ సీజన్‌ 7’ వేరు అన్నట్లుగానే ఉంది.. బిగ్ బాస్ గేమ్ నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ అస్త్రా అనే కాన్సెప్ట్ తో హౌజ్ మేట్స్ లో ఒక టెన్సన్, ఆడాలనే పట్టుదలను క్రియేట్ చేశారు. నిన్నటి ఎపిసోడ్ లో రతిక తన గొడవలు, ఆర్గుమెంట్ తో స్క్రీన్ స్పేస్ అయితే బాగానే సంపాదించుకుంది.. ఎపిసోడ్ మొత్తం తన చుట్టే తిరిగేలా చేయడంలో రితిక సక్సెస్ అయిందనే చెప్పొచ్చు..

New Update
Bigg Boss 7 Telugu : గేమ్ మొత్తం చేంజ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్..!!

Bigg Boss 7 Telugu Day 11: బిగ్ బాస్ గేమ్ నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు.. పవర్ అస్త్రా అనే కాన్సెప్ట్ తో హౌజ్ మేట్స్ లో ఒక టెన్సన్, ఆడాలనే పట్టుదలను క్రియేట్ చేశారు.. నిన్నటి ఎపిసోడ్ లో రతిక (Rathika) తన గొడవలు, ఆర్గుమెంట్ తో స్క్రీన్ స్పేస్ అయితే బాగానే సంపాదించుకుంది.. ఎపిసోడ్ మొత్తం తన చుట్టే తిరిగేలా చేయడంలో రితిక సక్సెస్ అయిందనే చెప్పొచ్చు..

పవర్ అస్త్రా కోసం టాస్క్
మాయాస్త్రాలను పొందిన రణధీర టీమ్ సభ్యులు అమర్ (Amar),ప్రియాంక, శోభా, శివాజీ (Shivaji),యావర్, షేకీల పవర్ అస్త్రా కోసం పోటీ పడతారు. వీరిలో పవర్ అస్త్రా ఎవరికి సొంతం అవ్వాలి అనేది మహాబలి టీమ్ సభ్యులు డిసైడ్ చేస్తారు. మహాబలి టీమ్ లోని సభ్యులు గౌతమ్, రతిక,దామిని, శోభ, తేజ,ప్రశాంత్.. వీళ్ళు ఒక్కొకరుగా వెళ్లి పవర్ అస్త్రాకు అనర్హులెవరో చెప్పి వారి దగ్గర ఉన్న మాయాస్త్రాలను అదే టీమ్ లో ఇంకో సభ్యుడికి ఇవ్వాలి.. ఇక వీళ్ళు పవర్ అస్త్ర ఎవరికి రాకూడదు.. అని స్ట్రాటజీస్ వేసుకుంటారు. గౌతమ్, తేజ లాస్ట్ లో వెళ్లి గేమ్ చేంజ్ చేసి వారు అనుకున్న వారికే పవర్ అస్త్రా వచ్చేలా చేద్దామని స్ట్రాటజీ అనుకుంటారు .

పవర్ అస్త్రాకు అనర్హులైన ముగ్గురు..
మహాబలి టీమ్ నుంచి దామిని(Damini), శుభ, ప్రశాంత్ ముగ్గురు వచ్చి ప్రియాంక, అమర్, శోభను పవర్ అస్త్ర కు అనర్హులు అని చెప్పి వారి దగ్గరున్న అస్త్రాలను శివాజీ,షేకీల, యావర్ కు ఇస్తారు. అందరూ బఫున్స్ అంటున్న రతిక.
ఇక నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. తేజ, గౌతమ్ రతిక ను వెళ్ళమంటారు.. గౌతమ్ , తేజ ప్లాన్ అర్ధమైన రతిక నేను ముందు వెళ్లను లాస్ట్ లోనే వెళ్తా.. నేనే గేమ్ చేంజ్ చేస్తా అంటూ తేజ, గౌతమ్ తో వాదిస్తుంది.. ఈ టీమ్ అంతా పెద్ద బఫున్స్ అని కామెంట్ చేస్తుంది.. దామిని పై కూడా గట్టిగా అరిచేస్తుంది దాంతో దామిని ఏడ్చేసింది .. గౌతమ్ ఎంత చెప్పినా వినకుండా నేను వెళ్ళను అని మొండిగా ఉంటుంది రతిక ..

గేమ్ చేంజ్ చేసిన బిగ్ బాస్
మహాబలి టీమ్ ఎవరు వెళ్ళాలో తెల్చలేకపోయేసరికి బిగ్ బాస్ అవతలి టీమ్ నుంచి ఎవరు రావాలి అనేది రణధీర టీమ్ డిసైడ్ చేస్తుంది అలాగే ఇదివరకే మాయాస్త్రలను కోల్పోయిన అమర్, ప్రియాంక,శోభా గేమ్ నుంచి ఔట్ అని పెద్ద ట్విస్ట్ ఇస్తారు. రెచ్చిపోయిన అమర్ గేమ్ నుంచి ఔట్ అవడంతో అమర్ గట్టి గట్టి అరుస్తూ.. ఒకరిని గేమ్ నుంచి తీసేయడం చాలా ఈజీ.. ఇంత చెత్త రీజన్స్ ఎలా చెప్తారు అంటూ ఫైర్ అవుతాడు. కోపంలో అమర్ ఏవో బూతులు కూడా మాట్లాడతాడు. మొత్తానికి రతిక మొండితనం వల్ల ఇంట్లో రచ్చ రచ్చ జరగుతుంది.. ఎప్పుడు కూల్ గా ఉండే గౌతమ్, సందీప్ కూడా అరిచేలా చేస్తుంది. ఇదంతా రతిక గేమ్ ప్లాన్ ఆ లేదా కంటెంట్ కోసం ఏమైనా చేస్తుందా అన్నట్లు అనిపిస్తుంది.. తన గొడవలు, ఆర్గుమెంట్స్ తో ఎపిసోడ్ మొత్తం తన చుట్టే నడిచేలా చేసుకుంది..

Also Read: ఏ మాత్రం తగ్గని బిగ్‌బాస్‌ క్రేజ్‌..వామ్మో ఇంత మంది చూస్తున్నారా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు