Pavel Durov:12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రి.. టెలిగ్రాం సీఈఓ ఘనత!

పెళ్లి చేసుకోకుండానే 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అయినట్లు టెలిగ్రాం సీఈఓ పావెల్‌ దురోవ్‌ వెల్లడించారు. ఫ్రెండ్ కోసం మొదలైన తన వీర్యదానం చాలా దేశాలకు పాకిందన్నారు. సంతానం లేని దంపతులకు సాయం చేయడం ఆనందంగా ఉందన్నారు.

New Update
Pavel Durov:12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రి.. టెలిగ్రాం సీఈఓ ఘనత!

Telegram CEO: మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ ఫౌండర్, సీఈఓ పావెల్‌ దురోవ్‌ సంచలన విషయం బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తాను తండ్రిని అయ్యానని తెలిపారు. ఈ మేరకు టెలిగ్రామ్‌ ఛానల్‌లో ఇందుకు సంబంధించి పోస్ట్‌ పెట్టిన దురోవ్.. ఇదంతా బయోలాజికల్‌గా జరిగిందని తెలిపారు.

publive-image

వారి సంతానం కోసం వీర్యదానం..
‘నాకు 100 మందికి పైగా పిల్లలున్నారు. పెళ్లి చేసుకోకుండా ఇదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా? 15 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ ఒకరు వింత సాయం కోరాడు. వారికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం నన్ను వీర్యదానం చేయమన్నాడు. అది విని నేను విపరీతంగా నవ్వుకున్నా. కానీ పిల్లలు లేని లోటు ఎలా ఉంటుందో ఆ బాధ తర్వాత అర్థమైంది. ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసేవారు చాలా తక్కువమంది ఉన్నారని ఓ డాక్టర్‌ నాకు చెప్పారు. వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యత అన్నారు. దీంతో నేను స్పెర్మ్‌ డొనేషన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నా. అలా ఇప్పటివరకు 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించా. చాలా ఏళ్ల క్రితమే నేను వీర్యం దానం చేయడం ఆపినప్పటికీ ఫ్రీజ్‌ చేసిన నా కణాలతో ఎన్నో కుటుంబాలకు పిల్లలు పుడుతున్నట్లు తెలుసుకుంటున్నా' అని వివరించారు.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడి, పాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్!

అయితే ఈ విషయం బయటపెట్టడంలో రిస్క్‌ ఉన్నప్పటికీ.. స్పెర్మ్‌ డోనర్‌ అయినందుకు సంతోషంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంతానలేమి సమస్య తీవ్రంగా ఉంది. అలాంటి వారికి పిల్లలను ఇచ్చి వారి ఇంట సంతోషం తెచ్చినందుకు నేను గర్వపడుతున్నా. మరింత ఎక్కువమంది వీర్య దానానికి ముందుకురావాలని కోరుతున్నా. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు పావెల్‌ దురోవ్‌.

Advertisment
Advertisment
తాజా కథనాలు