సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ టూర్.. ప్రతీ రైతుకు ఆవు.. బీజేపీ మేనిఫెస్టో ఇదే?

రేపు తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ టూర్, ప్రతీ రైతుకు ఆవు, కాలేజ్ విద్యార్థినులకు ఉచిత లాప్ టాప్ ల లాంటి ఆకర్షణీయమైన అంశాలు ఉంటాయని తెలుస్తోంది.

New Update
సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ టూర్.. ప్రతీ రైతుకు ఆవు.. బీజేపీ మేనిఫెస్టో ఇదే?

BJP Manifesto: తెలంగాణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీలు తమ మేనిఫెస్టో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఈరోజు మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బీజేపీ మ్యానిఫెస్టోను ఆయన ప్రకటించనున్నారు. అయితే.. బీజేపీ మేనిఫెస్టోలోని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

* రైతులకు ఎకరాకు రెండు పంటలకు 4 బస్తాల యూరియా, రెండు బస్తాల డీఏపీ చొప్పున ఉచిత ఎరువులు
* ప్రతీ రైతు కు దేశీ ఆవు
* కాలేజ్ విద్యార్థినులకు ఉచిత లాప్ టాప్ లు
* పుట్టిన ప్రతీ ఆడబిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ ( బిడ్డ 21 ఏళ్లకు వచ్చే సారికి 2లక్షలు వచ్చేలా..)
* సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీగా కాశీ, అయోధ్య టూర్
* ధరణి రద్దు చేసి .. భూసేవా పేరుతో కొత్త యాప్
* కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు* గల్ఫ్ బాధితుల కోసం నోడల్ ఏజెన్సీ.
* రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్.
* 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత.
* సబ్సిడీపై విత్తనాలు... వరి పై బోనస్.
* ఉజ్వల లబ్ధిదారులకు ఉచితంగా నాలుగు సిలిండర్ లు.
* మహిళ రైతు కార్పొరేషన్ ఏర్పాటు.
* ఫీజుల నియంత్రణ నిరంతర పర్యవేక్షణ.
* బడ్జెట్ స్కూల్స్ కు పన్ను మనిహాయింపులు.
* ప్రతీ జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు.
* నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.
* ఇండస్ట్రియల్ కారిడార్ ల ఏర్పాటు.
* PRC పై రివ్యూ... ప్రతీ 5 సంవత్సరాలకు ఓ సారి PRC
జీఓ 317 పై పునః సమీక్ష
* గల్ఫ్ దేశాల్లో తెలంగాణ భవన్ లు.
* 5 ఏళ్లకు లక్ష కోట్లతో బీసీ అభివృద్ది నిధి.
* రోహింగ్యాలు, అక్రమ వలస దారులనీ పంపించి వేస్తాం.
* తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.
* అన్ని పంటలకు పంట భీమా... భీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది.
* 5 ఏళ్లలో మహిళలకి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు.

ALSO READ:

1.లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు..

2.ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు