Indigo: 550 విమానాలు రద్దు..మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దయ్యాయి. నిన్న ఒక్కరోజే 550 విమానాలను రద్దు చేశారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది.
రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించారు.
గండిపేట మండలం వట్టినాగులపల్లిలో సర్వే నం.245/19లో సతీశ్‌షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమిలోకి ప్రవేశించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యక్తులు అక్కడి గోశాలను ధ్వంసం చేసినట్లు ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు నమోదైంది.
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వింత డిమాండ్ ముందుకు వచ్చింది. రోడ్లు, డ్రైనేజీల సంగతేమో గానీ.. కోతుల బెడదను తీర్చే వారికే ఓట్లేస్తామని జనం అంటున్నారు. కొంతమంది అభ్యర్థులైతే తమను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తామనిప్రచారం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని కోకాపేట నియోపోలిస్ భూములు మరోసారి రికార్డు ధరలు పలికాయి. బుధవారం మూడో విడత వేలం ప్రక్రియ ముగిసింది. ప్లాట్ నెంబర్ 19, 20లో ఉన్న 8.04 ఎకరాలకు అధికారులు వేలం నిర్వహించారు. దీంతో HMDAకు రూ.వెయ్యి కోట్ల లాభం చేకూరింది.
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నామని అన్నారు. బుధవారం హుజరాబాద్లో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం రెల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేపింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వ్యక్తులు నల్లని సంచుల్లో బాంబు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో భారీ శబ్దం వచ్చింది.
శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలంగాణ నుంచి పది ప్రత్యేక రైళ్లను శబరిమలకు వెళ్లే భక్తులకోసం నడపనున్నట్లు రైల్వే సంస్థ తెలిపింది.