వయస్సు చిన్నది.. మనస్సు పెద్దది
మహబూబాబాద్ జిల్లాకు చెందిన టెన్త్ విద్యార్థిని ముత్యాల సాయి సింధు మానవత్వం చాటింది. వరద సహాయక కార్యక్రమాలకు తన కిడ్డీ బ్యాంకు నుంచి రూ.3 వేలను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సీఎం ఆ చిన్నారిని అభినందించారు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన టెన్త్ విద్యార్థిని ముత్యాల సాయి సింధు మానవత్వం చాటింది. వరద సహాయక కార్యక్రమాలకు తన కిడ్డీ బ్యాంకు నుంచి రూ.3 వేలను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సీఎం ఆ చిన్నారిని అభినందించారు.
మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయగూడెం వద్ద ఆకేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన హైలెవల్ వంతెనను, పంట పొలాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. యువ శాస్త్రవేత్త ప్రయణిస్తున్న కారు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. వంతెన పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు.
భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్, మరిపెడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ ప్రాంతం వద్దే నిన్న ఓ యువ సైంటిస్ట్, ఆమె తండ్రి కారులో వెళ్తుండగా కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఎడతెరిపిలేని వర్షాలతో భారీ వరదకు ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు 300 మంది కార్మికులతో పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వరకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు.
సెప్టెంబర్ చివరి వారంలో 94 రైళ్లను రద్దు చేస్తుండగా..41 రైళ్లను రూట్ మార్చుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.వరంగల్-హసన్‌పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలో రద్దు చేసినట్లు సమాచారం.
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు.
తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ రోజు పరామర్శించారు. జిట్టా కుటుంబ సభ్యులు, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.