Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

జనగామ జిల్లా పాలకుర్తి మండల రామాలయంలో రాములోరి కళ్యాణంలో అపశృతి చోటుచేసుకుంది. గాలిదుమారం కారణంగా టెంట్లు కూలి భక్తుల తలలు పలిగాయి. వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. నిజామాబాద్ ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో కులవివక్ష వెలుగుచూసింది.

New Update
janagana incident

janagana incident Photograph: (janagana incident)

సీతారాముల కళ్యాణంలో అపశృతి.. శ్రీరామ నవమి పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం రామాలయం దగ్గర గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ఆలయం దగ్గర వేసిన టెంట్లు గాలిదుమారానికి కుప్పకూలిపోయాయి. కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన భోజనలు వితరణ చేస్తుండగా.. పెద్దగాలిదుమారం సంభవించింది. అక్కడున్న టెంట్లు కూలి భక్తులకు గాయాలయ్యాయి. ముగ్గురు భక్తులకు తలలు పగిలి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా భక్తులపై టెంట్లు కూలడంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన భోజనాలు నేల పాలయ్యాయి.

Also read: Husband suicide: కాజల్ వేధింపులు.. భరించలేక భర్త లైవ్ వీడియో చేసి సూసైడ్

మరో చోట.. నిజామాబాద్ జిల్లాలో గుడిలో కుల వివక్ష ఘటన వెలుగుచూసింది. ఏర్గట్ల మండలం తాల్లరాంపూర్లో శ్రీరామ నవమి కుంకుమర్చాన పూజలకు పూజారి మహిళలను గుడిలోకి అనుమతించలేదు. గౌడ కుల మహిళలను రామాలయంలోకి రావద్దని గ్రామాభివృద్ధి కమిటీ చెప్పిందని పూజారి అన్నాడు. చేసేదేమి లేక గుడి నుంచి గౌడ మహిళలు బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్లో గౌడ కులస్తులు, మహిళలు ఫిర్యాదు చేశారు.

Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

KCR: పోలీసులకు KCR మాస్ వార్నింగ్.. ఈరోజు డైరీలో రాసిపెట్టుకోవాలి

BRS 25ఏళ్ల సభలో కేసీఆర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వాయంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుందని.. కచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే నిలిదీస్తారని అన్నారు.

New Update
KCR Mass Warning

KCR Mass Warning

వరంగల్ ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే పోలీసులు ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వాయంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుందని.. కచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే నిలిదీస్తారని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే.. ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగారు. పోలీసులు ఎందుకు దునుకులాడుతున్నారని ప్రశ్రించారు. పోలీసులు వాళ్లు డ్యూటీ వాళ్లు చేయాలని.. రాజకీయాల్లోకి రాకుడదని సూచించారు. ఆరోజు తెలంగాణలో ఏర్పడ్డ పరిస్థితులకు వందకు వంద శాతం మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు. 

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

KCR Mass Warning To Police

Also read: KCR ఎమోషనల్ : ఇవన్నీ.. చూస్తుంటే నాకు భాదేస్తోంది

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

అక్రమ కేసులు పెట్టిన వారికి బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి తాను కూడా ఊరుకోడని.. ప్రజల తరుపున ప్రశ్నించే వాళ్ల వెంట ఉంటానని కేసీఆర్ అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేద్దామని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు పిలుపునిచ్చారు. ఇకనుంచి అందరి  లెక్కలు బయలకు తీద్దామని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

 

latest-telugu-news | BRS Warangal meeting

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు