Gas shortage : హైదరాబాద్ ను తాకిన యుద్ధ సెగలు...గ్యాస్ కొరతతో హోటల్స్ బంద్

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హైదరాబాద్ హోటల్స్ పై ప్రభావం పడింది. పలు హోటల్స్ మూసివేతకు చేరువవుతున్నాయి.

New Update
FotoJet

LPG shortage begins to hit Hyderabad

Gas shortage : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం ప్రపంచమంతా పడుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్‌ దిగుమతులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు.  వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా  నిలిపివేయడంతో నిన్నమొన్నటివరకు బెంగళూరు, ముంబయి, కోల్‌కతా నగరాలపై పడ్డ ప్రభావం తాజాగా హైదరాబాద్‌ను తాకింది. నగరంలోనూ  వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ప్రభావం పడింది. గత రెండు రోజులుగా గ్యాస్‌ కొరత మూలంగా రాష్ర్ట వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పలు హోటల్స్‌ మూతపడ్డాయి. ఇంకా కొన్ని హోటల్స్‌ రోజువారి మెనూను కుదించి ధరలను పెంచే ప్రయత్నంలో ఉన్నాయి. తాత్కాలికంగా టీ, కాఫీలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ హోటళ్ల అసోసియేషన్‌  ప్రకటించింది. 

ఈరోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేం

ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు నుంచి కేవలం ముఖ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే సరఫరా చేస్తామని, ఎక్కువ టైమ్ తీసుకునే చపాతీ, పూరి లాంటి వంటకాలు ఉండవని, కొన్ని కూరలు, ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటమ్స్ బంద్, సొంతంగా వంట చేసుకోవడానికి వీల్లేదు అంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు నోటీసు విడుదల చేసింది. 

WhatsApp Image 2026-03-11 at 10.16.44 AM (1)

ఇవేకాక వండేందుకు ఎక్కువ సమయం పట్టడం, ఎక్కువ నూనె వినియోగమయ్యే చపాతి, దోసె, పూరీ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్‌ స్పష్టం చేసింది. చిన్నచిన్న టిఫిన్‌ బండ్లతో పాటు పెద్దపెద్ స్టార్‌ హోటళ్ల దాకా వంటలు చేయడానికి గ్యాస్‌ తప్పనిసరి కావడంతో అయా హోటల్స్‌లో గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే హోటల్స్‌ నడిపే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమవద్ద ఉన్న సిలిండర్లు ఒకట్రెండు రోజులకు మించి నడపలేమని, పరిస్థితి ఇలాగే ఉంటే మూసివేయడం తప్ప మరో మార్గం  లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, నగరంలో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు లేదా ఎలక్ట్రిక్‌ ఇండక్షన్‌ స్టవ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం లేదని హోటళ్ల యజమానులు చెబుతున్నారు.  

తగ్గిన మెనూ..

ఇక హైదరాబాద్‌లోని పలు పీజీ హాస్టళ్లు, మెస్‌లలో వంటలు చేయడానికి ఎక్కువగా గ్యాస్‌నే వినియోగిస్తారు. గత రెండు రోజులుగా వాణిజ్య గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆయా హాస్టల్స్‌లో  మెనూలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి కేవలం అన్నం, సాంబారు, పప్పు, రసం వంటివాటికే పరిమితం చేశారు. రెండు, మూడురోజుల వరకు గ్యాస్‌ సరఫరా అందుబాటులోకి రాకపోతే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని హాస్టల్‌ నిర్వాహకులు తేల్చిచెబుతున్నారు.

హాస్టల్స్ మూసివేత

నగర వ్యాప్తంగా వందలాది హాస్టల్స్‌ ఉన్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, కోచింగ్‌ తీసుకోవడానికి వచ్చేవారితో హాస్టల్స్‌లో కనీసం 20 నుంచి 100 మంది వరకు వసతి పొందుతున్నారు.  ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్‌ మూసివేతకు చేరువవుతున్నాయి.దీంతో విద్యార్థులు, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులపై తీవ్రప్రభావం పడనుంది. ముఖ్యంగా ప్రస్తుతం పలు ఎగ్జా్మ్స్‌ జరుగుతుండగా వారిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. గ్యాస్‌ కొరత, నిత్యావసరాల ధరలు పెరగడంతో ఇప్పటికే పలు హోటళ్లు ధరలు పెంచాయి. ఇపుడు మరింత పెరిగే అవకాశం ఉండడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు హాస్టళ్ల నిర్వహకులు త్వరలో వంటలు నిలిపివేస్తామని భోజనానికి ప్రత్యమ్నాయం చూసుకోవాలని కోరడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కట్టెలపొయ్యి మీద బిర్యానీ

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం మూలంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ యుద్ధం ఎల్పీజీ గ్యాస్ కొరతకు దారి తీసింది.దీంతో పలు హెటల్స్ మూతపడ్డాయి.. కాగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ షాఘౌస్ రెస్టారెంట్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది.కట్టెల పొయ్యిమీద బిర్యానీ వండి భోజన ప్రియులకు వడ్డించింది. దీంతో మిగిలిన రెస్టారెంట్లు కూడా దాన్నే ఫాలో కావడానికి ఆసక్తి చూపుతున్నారు.

Advertisment
తాజా కథనాలు