Vijayashanti : విజయశాంతి కి కీలక పదవి..హైకమాండ్‌ ఆర్డర్‌..

కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎంపికలో ఢిల్లీ మార్క్ కనిపించింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. ఆమె 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆమెకు కీలక పదవీ కట్టబెడ్తారని ప్రచారం సాగుతోంది.

New Update
vijayashanti about sandhya theatre incident

vijayashanti

Vijayashanti : కాంగ్రెస్ ఎమ్మెల్సీల ఎంపికలో ఢిల్లీ మార్క్ కనిపించింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. విజయశాంతి చివరి నిమిషంలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లో పని చేసిన విజయశాంతి 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరారు. టీఆర్ఎస్ ఎంపీగా ఉద్యమ సమయంలో పని చేసారు. ఆ తరువాత పార్టీలో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ లోకి వచ్చారు. ఆ టైం లోనే విజయశాంతికి కీలక పదవి ఇస్తామని.. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాక్రే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత విజయశాంతి మౌనం దాల్చారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావించినా అవకాశం దక్కలేదు. దీంతో, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసారు.

Also Read :  మూడో భార్య ప్రెగ్నెంట్..  తండ్రి కాబోతున్న షోయాబ్ మాలిక్!

ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పార్టీ అధ్యక్షుడు ఖార్గేతో ఢిల్లీలో భేటీ అయ్యారు. తాను పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసారు. రాష్ట్రంలో ప్రభుత్వం - పార్టీ వ్యవహారాల గురించి వారితో చర్చించారు. తనకు అవకాశం ఇవ్వాలని.. పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ తో విజయశాంతికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సమయంలో అవి ఎమ్మెల్సీ పదవి రావటానికి సహకరించాయి. ఇక, విజయశాంతికి ఎమ్మెల్సీ ఖరారు కావటం కాంగ్రెస్ లో ఆసక్తి కర చర్చకు కారణమైంది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌తో పాటు విజయశాంతికి ఆ పార్టీ అధిష్ఠానం టికెట్లు ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Also Read: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్‌ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి
 
ఇక త్వరలో జరిగే మంత్రివర్గ విస్త రణలో విజయశాంతికి అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మంత్రులుగా పని చేస్తున్న వారిలో మార్పులు - చేర్పులు ఖాయమని చెబుతున్నారు. కొత్తగా ఆరుగురికి రేవంత్ మంత్రివర్గంలో అవకాశం ఉంది. కీలకమైన హోం, మున్సిపల్, విద్యా శాఖ లు రేవంత్ వద్దే ఉన్నాయి.  రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న పరిణామాలతో దూకుడుగా వ్యవహరించే వారిని ప్రోత్సహించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ కు సరైన కౌంటర్ ఇచ్చే నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. అందులో భాగంగా విజ‌య‌శాంతితో పాటు మ‌రికొంద‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌ని అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వ‌చ్చిందని ప్రచారం సాగుతోంది. దీంతో..మంత్రివర్గ విస్తరణ జరిగితే విజయశాంతికి పదవి ఖాయమని చెబుతున్న వేళ..హైకమాండ్ నిర్ణయం ఏంటి.. రేవంత్ స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Also Read:  Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్‌ హైజాక్‌కు భారత్‌ సాయం చేసిందని ఆరోపణలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment