కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాలయాపన చేసిందని బండి సంజయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ధరణిపై కమిటీ, హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీలతో కమిషన్లు వేసి టైమ్ పాస్ చేస్తున్నారని కాంగ్రెస్ పాలనపై సంజయ్ మండిపడ్డారు. ఇది కూడా చూడండి: యూన్‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు కాంగ్రెస్ = కమిటీలు,కమీషన్లు,కాలయాపనలు📌ధరణిపై కమిటీ📌హైడ్రా,మూసి, ఫోర్త్ సిటీలతో కమీషన్లు📌రైతు భరోసాపై కాలయాపనఅలాంటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలో కాదు ఒక యుగం గడిచినా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగుపడదుసావులు, కన్నీళ్ళే కాంగ్రెస్ కలకాలం నడిచే మార్గం.… — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 5, 2024 ఇది కూడా చూడండి: రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! ఏడాది మాత్రమే కాదు.. యుగాలు గడిచిన.. రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అలా కాలయాపన చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాది మాత్రమే కాదు.. ఒక యుగం గడిచినా కూడా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగుపడదని బండి అన్నారు. సావులు, కన్నీళ్లే కాంగ్రెస్‌కి కలకాలం నడిచే మార్గమని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది కూడా చూడండి: ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్స్ ఇదే! ఇదిలా ఉండగా.. ఇటీవల కూడా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నవి విజయోత్సవాలు కాదన్నారు. అవి కేవలం వికృత ఉత్సవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని, వారి చావులు ఉత్సవమని బండి సంజయ్ అన్నారు. ఇకనైన విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలని బండి సంజయ్ కోరారు. ఇది కూడా చూడండి: పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి